నేటి నుంచి ఎస్సెస్సీ పరీక్షలు

హాజరుకానున్న 5.08 లక్షల మంది విద్యార్థులు
అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
నిమిషం నిబంధన ఎత్తివేత..
5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17  తెలంగాణలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం  అధికారులు ఇప్పటికే  అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి పరీక్షలకు  5.08 లక్షల మంది విద్యార్థులు హాజరకానున్నారు.  పదో తరగతి పరీక్షలు  18 నుంచి  ఏప్రిల్‌ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.   పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 2,676 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను  నియమించారు.  ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు.
వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు ఒక్కో పరీక్ష కేంద్రంలో విద్య, రెవెన్యూ శాఖల నుంచి ఒక్కో అధికారి, ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన 144 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. విద్యార్థులకు తప్పు ప్రశ్నపత్రాలు జారీ చేస్తే ఇన్విజిలేటర్లనే బాధ్యులుగా చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్లను పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ వివరణలు కోరాలని ఆదేశించారు. అటువంటి వారిపై తెలంగాణ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్స్‌ ఆఫ్‌ మాల్‌ప్రాక్టీసెస్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 1997 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
పరీక్షలు  ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. అయితే విద్యార్థులకు మాత్రం 5 నిమిషాల వరకూ అలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి ప్రవేశం కల్పించనున్నారు. పరీక్షల నిర్వహణను సీసీ కెమరాల ద్వారా పర్యవేక్షిస్తారు. పరీక్షల్లో విద్యార్థులు ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. వారిని మిగిలిన పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తామని ప్రకటించారు. పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు%ౌౌ% ఉంటాయని హెచ్చరించారు.ఎగ్జామ్‌ ముగిసిన తర్వాతనే విద్యార్థులు, సిబ్బంది కూడా బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమ ల్లో ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులతో పాటు, పరీక్షల సిబ్బంది ఎవరూ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *