- ప్రకటన విడుదల చేసిక కిషన్ రెడ్డి
- బీహార్ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు సమాచారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27 : నేటి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడిరది. ఈ మేరకు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం అమిత్ షా రావాల్సి ఉండగా బీహార్ పరిణామాల నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఆదివారం బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణలో పర్యటించి ఒకే రోజు మూడు సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. అయితే కొన్ని అత్యవసర పనుల వల్ల అమిత్ షా పర్యటన రద్దు అయ్యింది. దీంతో అమిత్ షా పాల్గొనాల్సిన కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ సమావేశాలు వాయిదా పడిన్లటైంది.
బీహార్‌లో తాజా రాజకీయ పరిణామాలతో అమిత్ షా టూర్ రద్దు అయినట్లు సమాచారం. త్వరలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లోని కొంగరకలాన్ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల పార్టీ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం ఉంటుందని ప్లాన్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ హైకమాండ్ దిల్లీలో ఓ వార్ రూమ్ సిద్ధం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే వార్ రూమ్ పని చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి వొచ్చే సూచనలు, సలహాలు ఆధారంగా పని చేసే అవకాశాలు ఉన్నాయి. కనీసం పది నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా ప్రయత్నించాలని ఇప్పటికే దిల్లీ పెద్దలు దిశానిర్దేశర చేశారు.





