నిరుపేద ఐ.ఐ.టి విద్యార్థికి ఉపసర్పంచ్ మల్లేష్  రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు ఆగస్ట్ 1 : మండలంలోని మేడిగడ్డ గ్రామపంచాయతీ కి చెందిన నేనావత్ సందీప్ 6 నెలల క్రితం ఐ.ఐ.టి అల్ ఇండియా ఎస్టీ కేటగిరీలో ఐ.ఐ.టీ మద్రాస్ లో 139వ. ర్యాంక్ దక్కించుకున్నాడు.. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితుల దృశ్య తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయవాల్సిందిగ మేడిగడ్డ తండా ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ ను కోరారు. దీంతో మేడిగడ్డ తండా ఉపసర్పంచ్ తన వంతుగా రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈరోజు పై చదువుల కోసం మద్రాస్ కు వెళ్తున్న సందర్భంగా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ కి మంచి పేరు తీసుకోరవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయ్ రాథోడ్, రాజ్ కుమార్, సూర్య, కిషన్, భాస్కర్, లాలు, రాజు, నవీన్, బిమ్ల, పాండు, నరేష్, ఉమ, చిన్న, వసంత్, రాము, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *