- వరల్డ్ హార్ట్ డే లో.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్, బి నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: నేటి యాంత్రిక ఉరుకుల పరుగుల జీవనంలో… ఆనారోగ్య సమస్యలను అధిగమించ డానికి .. నిత్య వ్యాయామం తప్పనిసరి అని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా శుక్రవారం అవేర్ గ్లెనీగల్ గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో “వరల్డ్ హార్ట్ డే” ను నిర్వహించారు. ఈ సంద ర్భంగా నిర్వహించిన 5కే వాక్ కు కార్యక్రమానికి ముఖ్య అతి థిగా ఎల్.బి.నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై 5 కే వాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రూపొందించిన బ్రోచర్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిరోజు ఉదయం వ్యాయాయం , వాకింగ్ తప్పనిసరిగా చేయాలని సూచించారు. వీటి ద్వారా ద్వారా గుండె జబ్బుల నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు. తీసుకునే ఆహారం.. వాతావరణ మార్పుల వల్ల ఇటీవల కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు రావడం జరుగుతుందన్నారు. గుండెపోటు ద్వారా చిన్న వయసులో ప్రాణాలు కోల్పోతున్నారని సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వాకింగ్, ఎక్సర్సైజుల ద్వారా రక్తపోటు, షూగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ బీపీ షుగర్ ల ను సాధారణ మోతాదులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కరుణాకర్ రెడ్డి, రాజీవ్ గర్గ్, ముఖేష్ రావు,శ్రీనివాస్ రెడ్డి, మళ్లింద్ర స్వామి,సుదర్శన్ రావు, సంజీవరావు, సుశాంత్ నర్సింగ్ సిబ్బంది, హాస్పిటల్ యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు.




