నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదిక

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 17: ‌స్వలాభం కోసం కాకుండా.. రాష్ట్ర భవిష్యత్‌ ‌కోసమే బూర నర్సయ్య గౌడ్‌ ‌బీజేపీలో చేరుతున్నారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రెండు రోజుల క్రితం టీ ఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన డా.బూర నర్సయ్య గౌడ్‌ ఇం‌టికి సోమవారం వెళ్లిన బండి సంజయ్‌ ఆయనను పార్టీ లోకి ఆహ్వానించారు .ఈ సందర్బంగా బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ ..బూర నర్సయ్య గౌడ నిజాయితీకి మారు పేరుఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బూర నర్సయ్య లాంటి నేతలు కేసీఆర్‌ ‌ను కలిసే పరిస్థితి లేదు..

మునుగోడులో టీఆర్‌ఎస్‌ ‌కు బుద్ది చెప్పటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు ..దుబ్బాక, హుజూరాబాద్‌ ‌కు కేంద్రం ఇచ్చిన నిధులపై ఎన్నికల సమయంలోనే గ్రామగ్రామానికి వెళ్లి స్పష్టత ఇచ్చాం ..రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కేసీఆర్‌ ఇవ్వటం లేదు ..ఫాంహౌజ్‌ ‌నుండి కేసీఆర్‌ ‌ను ఇందిరా పార్క్ ‌కు తీసుకొచ్చిన ఘనత బీజేపీదే..భారత రాష్ట్ర సమితి అధినేతనని చెప్పుకున్న కేసీఆర్‌ ‌ను మునుగోడు ఎన్నికల్లో ఒక గ్రామానికే పరిమితం చేసిన ఘనత బీజేపీదే ..దుబ్బాక, హుజూరాబాద్‌ ‌నియోజకవర్గాలకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *