‌ద్రౌపది ముర్ము ఎంపికతో ఆదివాసీలకు గుర్తింపు

ఆ ఘనత బిజెపిదే అన్న బండి సంజయ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌సామాజిక న్యాయం చేసేది బీజేపీనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన మోడీ, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. జులై 3న జరిగే ప్రధాని మోడీ సభకు గిరిజన, ఆదివాసీలు భారీగా తరలి రావాలని పిలుపు నిచ్చారు. మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్‌ ‌కలాంను, ఎస్సీ వర్గానికి చెంది కోవింద్‌ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదే అన్నారు. అలాగే ఈ సారి ఎస్టీ వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేయబోతున్నారన్నారు.

ద్రౌపది ముర్ము ఎంపిక దేశవ్యాప్తంగా ఎస్టీ సామాజివర్గానికి దక్కిన గుర్తింపు అన్నారు. ఇది దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తల్లిగా దేశానికి ద్రౌపది ముర్ము సేవ చేస్తారని ఆకాంక్షించారు. ప్రధాని మోదీని అంబేద్కర్‌ ‌వారసుడితో బండి సంజయ్‌ ‌పోల్చడం గమనార్హం. మోదీ నిర్ణయాలతో బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌తృప్తి చెందుతారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *