దివ్యాస్త్రం ‘‘వోటు’’

వోటు అంటే..
రెండక్షరాల పదం కాదు

చిన్న సిరా చుక్క కాదు
చిత్తు కాగిత ముక్క కాదు

అంగడిలో సరుకు కాదు
ఆట వస్తువు కానే కాదు

దేశ పౌరునికి రాజ్యాంగం
కల్పించిన విశిష్ట హక్కు

అమూల్యమైన వోటు
దేశ చరిత్ర మార్చేస్తుంది
ప్రగతి పథం నిర్దేశిస్తుంది

ఆ దివ్యాస్త్రం సంధించి
పీఠాలను నిలబెట్టవచ్చు
కాదంటే కూల్చివేయవచ్చు

రాజకీయ నాయకులను
చట్టసభలకు పంపవచ్చు
ఇంటి దారి పట్టించవచ్చు

నీ అమూల్యమైన వోటు
ప్రజాస్వామ్య వ్యవస్థలో
నీ ఆశయ చిత్రం కావాలి

పాలనా యంత్రాంగంలో
నీ ప్రశ్నించే గొంతు కావాలి

వోటు సక్రమంగా వేస్తేనే
బతుకు అర్థం పరమార్థం

ఓ వోటు అస్త్రదారుడా!
మందు, మనీకి లొంగక
తాయిలాలకు తలొగ్గక

జన శ్రేయకై పరితపించే
దేశ ప్రగతికై పరిశ్రమించే

సద్గుణనేతకు పట్టంగట్టు
ప్రజాస్వామ్యం నిలబెట్టు

(జనవరి 25 న జాతీయ వోటర్ల దినోత్సవం సందర్భంగా..)
– కోడిగూటి తిరుపతి, 95739493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *