దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఈడి దూకుడు

మరోమారు టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత మాజీ ఆడిటర్‌ ‌బుచ్చిబాబుకు నోటీసులు

న్యూ దిల్లీ, మే 3 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌  ‌బుచ్చిబాబుకు మరోసారి నోటీసులు పంపింది. దీంతో దిల్లీలోని ఈడీ కార్యలయానికి బుచ్చిబాబు వెళ్లారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు బుచ్చిబాబును మరోమారు ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన బుచ్చిబాబు .. సీబీఐ స్పెషల్‌ ‌కోర్టు బెయిల్‌ ‌పై బయటకు వొచ్చారు.ఈ కేసులో  సౌత్‌ ‌గ్రూప్‌ ‌తరపున బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనపై అభియోగాలు మోపాయి. దీంతో ఈ కేసులో బుచ్చిబాబును ఈడీ, సీబీఐ అధికారులు వేర్వేరుగా విచారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *