తెలంగాణ పేరు కూడా ప్రస్తావించరా

  • బడ్జెట్‌లో ఇంతగా వివక్ష చూపడం దారుణం
  • కేంద్ర బడ్జెట్‌ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ రావు
  • అసెంబ్లీ సమావేశాలను కుదించడంపై ఆగ్రహం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23 : కేంద్ర బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ పేరు కనీసం కూడా ప్రస్తావించలేదని..రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని కేంద్రబడ్జెట్‌లో మొత్తంగా గుండు సున్న ఇచ్చారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు విమర్శించారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డితో కలిసి హరీష్‌ రావు మాట్లాడుతూ… ఏపీకి అన్ని నిధులు ఇచ్చారని, దానికి తాము ఏమనటం లేదని, తెలంగాణలో కూడా 9 వెనకపడిన జిల్లాలు ఉన్నాయని..వాటికి ఎందుకు నిధులు విడుదల చేయటం లేదని నిలదీశారు. ఇది పూర్తి నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే బాధ కలుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ పదమే ఉచ్ఛరించలేదని, ఆంధ్రప్రదేశ్‌ పేరును అనేకసార్లు ఉచ్ఛరించారని హరీష్‌ రావు గుర్తు చేశారు. పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారని, ఏపీ రాజధానికి డబ్బులు ఇస్తామమన్నరని, రాయలసీమతో పాటు ఆంధ్రాలోని వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తమన్నరని, ప్రత్యేకంగా ఈ విషయాలను ప్రస్తావించడం సంతోషమే కానీ తెలంగాణ విషయం ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని హరీష్‌ రావు ప్రశ్నించారు. కేంద్రంతో

సత్సంబంధాలు మెయింటెన్‌ చేస్తున్నామని,  మోదీకి దగ్గరగా ఉన్నామని, కేంద్ర మంత్రులను రోజు కలుస్తున్నామని చెప్పారని, కానీ కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి తెలంగాణకు అన్యాయం చేశాయని హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని, విభజన ట్టం ప్రకారం తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు చొరవ చూపడం లేదని, తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూపుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలంటే కేంద్రానికి, బీజేపీకి ఎందుకింత నిర్లక్ష్యమంటూ మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వొచ్చని, కానీ జాతీయ ప్రాజెక్టు ఊసేలేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ప్రస్తావన లేనే లేదని, తెలంగాణకు మొత్తానికి గుండు సున్నా ఇచ్చారని హరీష్‌ రావు ఎద్దేవా చేశారు.

తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగిందని, తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు.. తెలంగాణకు నిధుల్లో వాటా తేవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుందని హరీష్‌ రావు స్పష్టం చేశారు. ఇకపోతే శాసనసభ సమయాన్ని వాళ్ల పథకాల్లాగే ఎత్తేస్తున్నారని దుయ్యబట్టారు. నాలుగు రోజుల్లో బడ్జెట్‌ సమావేశాలు ముగించాలని చూస్తున్నారని చెప్పారు. గతంలో వీరే 15 రోజులు ఉండాలని డిమాండ్‌ చేసేవారని గుర్తుచేశారు. నిరుద్యోగుల ఎజెండా పెట్టాలని బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున తాము అడిగామన్నారు. తెలంగాణ గవర్నర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ వొచ్చాక దారుణాలు, దొంగతనాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆరు గ్యారెంటీల విూద చర్చ పెట్టాలని తాము అడిగామని చెప్పారు. రుణమాఫీ విూద మొదటి సంతకం అన్నారని… ఇప్పుడు అందరికి ఇవ్వకుండాసీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రం మొత్తం విష జ్వరాలు ఉన్నాయన్నారు. లోకల్‌ బాడీలకి ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.

ఫీజు రియింబర్స్‌ మెంట్‌ ఇవ్వటం లేదని.. మొత్తం 9 అంశాల విూద చర్చ పెట్టాలి అడిగామని హరీష్‌ రావు గుర్తు చేశారు.  గతంలో బడ్జెట్‌పై 4 నుంచి 8 రోజుల వరకు మాట్లాడిన సందర్భాలున్నాయి. మొత్తం పద్దులపై రెండు రోజుల్లో చర్చ జరగాలట అని ఎద్దేవా చేశారు. 15 డిమాండ్లపై ఒక్క రోజులోనే చర్చ పూర్తి చేయాలట అని, బడ్జెట్‌ విూద కూడా ఒకే రోజు చర్చ చేపట్టి, అదే రోజు సమాధానం ఇస్తారట అంటూ విమర్శించారు. ఎన్నికల హావిూలపై శాసనసభలో కూడా చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదని హరీష్‌ రావు మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు..ఇదే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు 10 రోజులు, 12 రోజులేనా సభ అని మాట్లాడారని, ఇప్పుడేమో నాలుగు రోజులకు కుదించేస్తున్నారని అన్నారు. జాబ్‌ క్యాలెండర్‌, గ్రూప్‌ `2, 3 పోస్టులు పెంచాలని, వీటిపై చర్చ పెట్టాలని తాము స్పీకర్‌ ముందు ప్రతిపాదన పెట్టామని, తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని, నిరుద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారని, నిరుద్యోగుల సమస్యలపైనే చర్చ చేపట్టాలని తాము గట్టిగా డిమాండ్‌ చేశామని, ఇదే విషయాన్ని గవర్నర్‌కు కూడా చెప్పామని హరీష్‌ రావు గుర్తు చేశారు.

శాంతి భద్రత నిర్వహణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, మర్డర్లు, అత్యాచారాలు, చైన్‌ స్నాచింగ్‌లు పెరిగాయని, గత పదేండ్లు రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ బాగుండెనని, ఈ ఏడు నెలల కాలంలో మాత్రం భయపడే పరిస్థితులు వొచ్చాయని విమర్శించారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వీరి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశామని, ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, చట్టబద్దత తెస్తామని చెప్పారని, మన ఊరు మన బడి కార్యక్రమాలను ఆపేశారని, పెండిరగ్‌ బిల్లులు త్వరగా మంజూరు చేయాలని కోరామని హరీష్‌ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *