తెలంగాణ కు నిత్య విజయాలు…: సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

దసరా పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరా కు ప్రత్యేక స్థానం వున్నదని సిఎం అన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయ దశమి పేరు తో దేశ వ్యాప్తంగా జరుపు కుంటారని సిఎం తెలిపారు.దసరానాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపు కోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యత కు నిదర్శనంగా నిలుస్తుందని సిఎం అన్నారు. శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం అన్నారు.  పోరాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, అగ్రపథాన కొనసాగించేందుకు విజయ దశమి స్ఫూర్తితో అలుపెరుగని పోరాటం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ కు నిత్య విజయాలు కలిగేలా దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరి పై వుండాలనీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని సీఎం కేసీఆర్ దుర్గామాతను ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *