కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
తిరుమల, డిసెంబర్ 7 : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఒకటే కంపార్టమెంట్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. వీరికి ఆరుగంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.మంగళవారం స్వామివారిని 64,163 మంది భక్తులు దర్శించుకోగా 23,709 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.36 కోట్లు వచ్చిందని తెలిపారు.
ఇదిలావుంటే తిరుపతి కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రం సందర్భంగా కృత్తికా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపై దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ భూపతి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.




