తప్పుడు రిటర్న్‌లు సమర్పిస్తే జరిమానా, జైలు

ఐటి అధికారి తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్‌, ‌జూలై 8 : ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆదాయ వివరాలను తప్పుగా సమర్పించినా, అర్హత లేని మినహాయింపులు కోరినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆంధ్రా, తెలంగాణ ఇన్‌కమ్‌ ‌ట్యాక్స్ ‌చీఫ్‌ ‌కమిషనరు మిథాలీ మధుస్మిత పేర్కొన్నారు. జైలుశిక్షతోపాటు 12 శాతం వడ్డీ, 200 శాతం పన్ను ఫెనాల్టీ రూపంలో వసూలు చేయనున్నట్లు తెలిపారు.

ఈ పక్రియలో తప్పుడు క్లెయిమ్స్ ‌చేసి రీఫండ్‌ ‌పొందిన పన్ను చెల్లింపుదారులు మదింపు సంవత్సరాలు 2021-22, 2022-23కు సవరించిన రిటర్సస్ ‌దాఖలు చేసి 140(బి) సెక్షన్‌ ‌ప్రకారం పన్ను చెల్లించాలని, మదింపు సంవత్సరం 2023-24 కోసం ఇప్పటికే రిటర్నస్ ‌సమర్పించిన వారు 139(5) సెక్షన్‌ ‌ప్రకారం సవరించిన రిటర్నస్ ‌దాఖలు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రా, తెలంగాణల్లోని పలువురు ఉద్యోగులు తమకు అర్హత లేకపోయినప్పటికీ అసంబద్ధమైన మినహాయింపులు, తగ్గింపులు కోరుతూ 75 శాతం నుంచి 90 శాతం మంది రీఫండ్‌ ‌తీసుకోవడానికి దరఖాస్తు చేసినట్లు గుర్తించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *