డబ్ల్యుహెచ్‌ఓ ‌కోవిడ్‌ ‌మరణాల లెక్క తప్పుల తడక

కోవిడ్‌ ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ఎన్‌కే అరోరా

న్యూ దిల్లీ, మే 6 : భారత్‌లో కోవిడ్‌ ‌వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదకను కేంద్రం తప్పుపట్టింది. దీన్ని కోవిడ్‌ ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ఎన్‌కే అరోరా కూడా తప్పుపట్టారు. భారత్‌లో సంభవించిన మరణాలపై డబ్ల్యూహెచ్‌వో ఇచ్చిన నివేదికలో ఎటువంటి లాజిక్‌ ‌కానీ, వాస్తవం కానీ లేదన్నారు. ఆ నివేదిక ఆందోళన కలిగించేలా ఉందన్నారు. మరణాల విషయంలో ఉంటే 20 శాతం తేడా ఉంటు ందేమో అని ఆయన అన్నారు.

దేశంలో మరణ ధృవీకరణ విధానం పటిష్టంగా ఉందని, వైరస్‌ ‌సంబంధింత మరణాలన్నీ నమోదు అయి నట్లు ఆయన వెల్లడించారు. డబ్ల్యూ హెచ్‌వో రిపోర్ట్ ‌తప్పుడుగా ఉందని అరోరా అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రా లు కొంత ఆలస్యంగా కోవిడ్‌ ‌మరణాలను రిపోర్ట్ ‌చేస్తున్నాయని, భారత్‌ ‌చాలా పెద్ద దేశమని, ఒకవేళ మరణాల నమోదు తప్పినా..అది డబ్ల్యూహెచ్‌వో చెప్పినట్లు 10 శాతం తేడా ఉండదని అరోరా అన్నారు. ఇండియా ఇచ్చిన డేటాను డబ్ల్యూహెచ్‌వో పట్టించుకోలేదని, తన సొంత గణాంకాలనే అది నమ్ముకున్నట్లు ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *