ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నిర్మల్, ప్రజాతంత్ర, జూన్ 16 : బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల నిరసనలను కొనసాగుతుండగానే నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ నియామకం జరిగింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ నియామకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాగా తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. ప్రభుత్వం స్పష్టమైన హావి• ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థుల ఆందక్షళన నేపథ్యంలోనే ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్‌ను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా నియమించింది.
డైరెక్టర్ నియామకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేసినా వీసీ వల్లనే ఏం కాలేదు… డైరెక్టర్ ఏం చేస్తారంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ నుంచి స్పష్టమైన హావి• వొస్తే తప్ప తమ ఆందోళనను విరమించేదిలేదని విద్యార్థుల తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్ తీరు బాగోలేదని, చర్చలకు పిలిచి బెదిరించారని విద్యార్థులు తెలిపారు. ఈ క్రమంలో బాసర ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ నియామకం అయ్యారు.



