ఉత్తర్వులు జారీ చేసిన ఈఓ
హైదరాబాద్,నవంబర్10: తెలంగాణ లో తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా దేవులపల్లి అజయ్ ని నియమిస్తూ కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేసారు. జూబిలీ హిల్స్, హిమాయత్ నగర్ మరియు నిర్మాణం లో ఉన్న కరీంనగర్ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ది కార్యక్రమాల్లో సేవా భావంతో పాల్గొననునట్లు లేఖలో పేర్కొన్నారు. తన పై నమ్మకం తో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్య సలహా దారులు శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి, తితీదే ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ శ్రీ ఏ.వీ. ధర్మా రెడ్డి మరియు జాతీయ మీడియా సలహాదారు శ్రీ దేవులపల్లి అమర్ కు అజయ్ కృతజ్ఞతలు తెలియపారు.





