చంద్రుడిపై భారీగా సోడియం నిల్వలు

చంద్రయాన్‌-2 ‌లో గుర్తిచిన ఇస్రో

న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్‌-2 ‌గుర్తించింది. చంద్రయాన్‌-2‌లో ఉన్న క్లాస్‌ (‌చంద్రయాన్‌-2 ‌లార్జ్ ఏరియా సాప్ట్ ఎక్స్‌రే స్పెక్టోటర్‌) ‌ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్‌ ‌చేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. గతంలో చంద్రయాన్‌-1‌లోని ఫ్లూరోసెన్స్ ‌స్పెక్టోటర్‌ (‌సీ1ఎక్స్ఎస్‌) ‌తొలిసారిగా చంద్రుడిపై సోడియం ఉన్నట్లు గుర్తించింది. ఇప్పుడు చంద్రయాన్‌-2 ఈ ‌సోడియం మ్యాపింగ్‌ ‌చేసినట్లు ఇస్రో ప్రకటించింది. హైసెన్సిటివిటీ, సామర్ధ్యం కలిగిన క్లాస్‌ను యూఆర్‌ ‌రావు శాటిలైట్‌ ‌సెంటర్‌లో తయారుచేసినట్లు ఇస్రో తెలిపింది. దీనివల్లనే ఇది సోడియం లైన్స్‌ను వెంటనే గుర్తిస్తుందని పరిశోధకులు చెప్పారు.

లూనార్‌ ‌గ్రెయిన్స్‌తో కలిసి ఉన్న సోడియం కళాలను ఈ క్లాస్‌ ‌గుర్తించింది. చంద్రుడిపై ఉన్న వాతావరణంలో ఇలా సోడియం లభించడం ఆశ్చర్యకరమని చెప్పారు. ఈ మేరకు ’ది ఆస్టోఫ్రిజికల్‌ ‌జర్నల్‌ ‌లెటర్స్’‌లో ప్రచురితమైన కథనంలో ఇస్రో పేర్కొంది. చంద్రుడి ఉపరితలం నుంచి వేల కిలోటర్ల వరకు సోడియం జాడలు కనిపించినట్లు ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలం, ఎక్సోస్ఫేర్‌ ‌సంబంధాన్ని అధ్యయనం చేయడానికి తాజా పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల భావన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *