సమర్థించిన సుప్రీమ్ కోర్టు ధర్మాసనం
కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు
న్యూ దిల్లీ, జూన్ 24 : 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్ చీట్ ను సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటీషిన్‌ను సుప్రీమ్ తోసిపుచ్చింది. జస్టి ఖన్విల్కర్,జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిప్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ గుజరాత్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని.. పిటీషన్‌ను తిరస్కరిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. డిసెంబర్ 8, 2021న ఈ కేసులో విచారణ పూర్తయ్యింది. అయితే అత్యున్నత న్యాయస్థానం శుక్రవరాం తీర్పును వెలువరించింది. ఈ అల్లర్లలో కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ మరణించారు. ఇక గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. మోడీతోపాటు ఇతర రాజకీయ నేతలపై 2006లో జాకియా జఫ్రీ ఈ కేసు వేశారు.గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ని సుప్రీంకోర్టు శుక్రవారం ధృవీకరించింది.
హైకోర్టు ఆదేశాలపై వేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం తిరస్కరించింది. గుజరాత్ హింసాకాండలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మరో 63 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ మరణించిన కాంగ్రెస్ నేత ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2002వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో జరిగిన హింసాకాండలో ఎహ్సాన్ జాఫ్రీ మరణించారు. హైకోర్టు ఆదేశాలపై వేసిన పిటిషన్ తిరస్కరణజాఫ్రీ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించాలని, లేకపోతే సామాజిక ఉద్దేశాల వల్ల అంతులేని కసరత్తు జరుగుతుందని సిట్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. ఈ పిటిషన్‌లో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ రెండో పిటిషనరుగా ఉన్నారు.జకియా జాఫ్రీ తరపున హాజరైన కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ సిట్ దర్యాప్తు నిర్వహించలేదని, కుట్రదారులను రక్షించేందుకు దాని విచారణ లోపాలతో నిండిపోయిందని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. సిట్ అధికారులతో పాటు పోలీసులకు రివార్డు లభించిందని కపిల్ సిబల్ అన్నారు.




