భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పాటు భద్రాచలం ప్రజలకు సేవలు అందించిన కుంజా సత్యవతి అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో జాతి నొప్పి రావడంతో ఒకటా కొట్టిన ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచారు. 2009లో ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భద్రాచలం నియోజకవర్గం లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సత్యవతి మంచి గుర్తింపు సాధించారు. వైయస్ మరణానంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత రాష్ట్ర విభజన అనంతరం సత్యవతి బిజెపి పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో కుంజా సత్యవతి బిజెపి పార్టీ తరఫున పోటీ చేసి అయినప్పటికీ బీజేపీ పార్టీలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. జరగనున్న ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఆమె హఠాత్ మరణం తో భద్రాచలం ప్రజలు శోకసంద్రంలో మునిగారు. ఆమె మరణ వార్త విన్న వెంటనే భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ మరణ వార్త విన్న భద్రాద్రివాసులంతా ఆమని చివరి చూపు చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.
గుండెపోటుతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి





