‌క్రికెట్‌ ‌స్కామ్‌ ‌కేసులో ఫరూక్‌ అబ్ధుల్లాపై చార్జిషీట్‌ ‌దాఖలు చేసిన ఇడి

శ్రీనగర్‌, ‌జూలై 26 : క్రికెట్‌ ‌స్కామ్‌ ‌కేసులో మనీల్యాండరింగ్‌ ‌నియంత్రణ చట్టం నిబంధనల కింద జమ్మూ కశ్మీర్‌ ‌మాజీ సీఎం ఫరూక్‌ అబ్ధుల్లాపై శ్రీనగర్‌ ‌కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఇడి) చార్జిషీట్‌ ‌దాఖలు చేసింది. మనీ ల్యాండరింగ్‌ ‌కేసులో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌చీఫ్‌ ‌ఫరూక్‌ అబ్ధుల్లా, అహ్మద్‌ ‌మిర్జా, ఇతరులను కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే..జమ్మూ అండ్‌ ‌కశ్మీర్‌ ‌క్రికెట్‌ అసోసియేష న్‌కు 2001-2012లో ఫరూక్‌ అబ్ధుల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై ఇడి దర్యాప్తు కొనసాగి స్తుంది. పీఎంఎల్‌ఏ ‌నిబంధనల కింద ఇడి ఇప్ప టికే శ్రీనగర్‌ ‌ప్రత్యేక పీఎంఎల్‌ఏ ‌కోర్టులో అను బంధ ప్రాసిక్యూషన్‌ ‌కంప్లయింట్‌ను దాఖలు చేసింది. ఇడి ఫిర్యాదు ఆధారంగా ఫరూక్‌ అబ్ధుల్లా సహా నిందితులు ఆగస్ట్ 27‌న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *