కోయపోషగూడెం ఘటనపై స్పందించిన మహిళా కమిషన్‌

‌సుమోటోగా కేసు స్వీకరించినట్లు చైర్మన్‌ ‌సునీతా లక్ష్మారెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో జరిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌వాకిటి సునీతా లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. గిరిజన మహిళలపై జరిగిన దాడిని చైర్‌ ‌పర్సన్‌ ‌ఖండించారు. ఈ ఘటనను మహిళా కమిషన్‌ ‌సుమోటోగా స్వీకరించిందని చైర్‌ ‌పర్సన్‌ ‌ప్రకటించారు.

ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, ‌రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీలను సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు రాష్ట్ర మహిళా కమిషన్‌ అం‌డగా ఉంటుందని, వారికి ప్రభుత్వ పక్షాన న్యాయం జరుగుతుందని హావి• ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *