తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించారు. మొదటి సారి 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో…చేవెళ్ల నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత 2004లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధప్రదేశ్ కు తొలి మహిళా హోం శాఖ మంత్రిగా పని చేశారు. అంతకు ముందు ఆమె భర్త ఇంద్రారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హోంశాఖ మంత్రిగా పని చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ హోంమత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి…కాంగ్రెస్ తరపున గెలుపొందారు. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో పోటీ దూరంగా ఉన్న ఆమె…2018లో గెలుపొందిన తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే…ఐదోసారి గెలుచినట్లవుతుంది.
ఏటికి ఎదురీదిన వారిలో శ్రీధర్ బాబు ముందు వరుసలో ఉంటారు. 1999 ఉమ్మడి ఆంధప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గాలి వీచింది. మంథనిలో మాత్రం శ్రీధర్ బాబు గెలుపొందారు. మాజీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, ఆరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. 1999, 2004, 2009, 2018 వరుస ఎన్నికల్లో గెలుపొందారు. ఒక్క 2014లో మాత్రమే శ్రీధర్ బాబు ఓటమి పాలయ్యారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధు చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో పుట్ట మధుపై శ్రీధర్ బాబు గెలుపొందారు. 2009 లో గెలిచిన శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేశారు. స్పీకర్ పదవికే వన్నె తెచ్చారు శ్రీపాదరావు.
తెలంగాణలో కొందరు నేతలు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పలువురు సీనియర్లు ఆయా నియోజకవర్గాల్లో వరుసగా గెలుస్తూ ప్రజల్లో పట్టు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచినా వారిని విజయాలే వరించాయి. రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టాలని రాజకీయ నేతలందరికీ ఉంటుంది. కొందరు నేతలు ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకముద్ర వేసుకున్నారు. పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా వారిని విజయాలే వరిస్తున్నాయి. ప్రతికూల రాజకీయ పరిస్థితులకు ఎదురొడ్డి ప్రజల నాడిని పట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎదురులేదని నిరూపించుకుంటున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, అక్బరుద్దన్ ఓవైసీ గ్రేటర్ రాజకీయాల్లో వీరంతా ప్రత్యేక గుర్తింపు సంపాదిం చుకున్నారు. ఏటికి ఎదురీదిన వారిలో శ్రీధర్ బాబు ముందు వరుసలో ఉంటారు. 1999 ఉమ్మడి ఆంధప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గాలి వీచింది. మంథనిలో మాత్రం శ్రీధర్ బాబు గెలుపొందారు. మాజీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, ఆరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. 1999, 2004, 2009, 2018 వరుస ఎన్నికల్లో గెలుపొందారు. ఒక్క 2014లో మాత్రమే శ్రీధర్ బాబు ఓటమి పాలయ్యారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధు చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో పుట్ట మధుపై శ్రీధర్ బాబు గెలుపొందారు. 2009 లో గెలిచిన శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేశారు. స్పీకర్ పదవికే వన్నె తెచ్చారు శ్రీపాదరావు. అలాగే తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించారు. మొదటి సారి 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో…చేవెళ్ల నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొం దారు. ఆ తర్వాత 2004లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధప్రదేశ్ కు తొలి మహిళా హోం శాఖ మంత్రిగా పని చేశారు. అంతకు ముందు ఆమె భర్త ఇంద్రారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హోంశాఖ మంత్రిగా పని చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ హోంమత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందారు. 2009లో మహేశ్వరం నియోజ కవర్గం నుంచి బరిలోకి దిగి…కాంగ్రెస్ తరపున గెలుపొం దారు. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో పోటీ దూరంగా ఉన్న ఆమె…2018లో గెలుపొందిన తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు.
– ప్రజాతంత్ర డెస్క్




