- ఆయురారోగ్యాలను పొందండి
- వొచ్చే ఎన్నికల్లో కెటిఆర్‌ను సిఎం చేయడం కోసమే కెసిఆర్ ప్రయత్నాలు
- కాంగ్రెస్ అధికారంలోకి వొస్తేనే హుస్నాబాద్ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం
- కొత్తకొండ పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
భీమదేవరపల్లి (హన్మకొండ జిల్లా), ప్రజాతంత్ర, మార్చి 2 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు మీ శేష జీవితాన్ని ఫామౌజ్‌లో గడపండి, పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి హితవు పలికారు. బాన్స్ వాడ పర్యటనలో సిఎం కెసిఆర్ తాను 69 ఏళ్ల ముసలివాడిని అయిపోయాను, ఇక రిటైర్డ్ అవుతున్నానని ప్రకటించారని పేర్కొన్నారు. అయితే కెసిఆర్ రిటైర్డ్ కాకున్నా కూడా వొచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓడించి ఇంటికి పంపుతారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొస్తుందని అన్నారు. హాత్ సే హాత్ జోడోయాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి నేతృత్వంలో గురువారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామిని రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్రాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, ఇసుక దోపిడీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలతో వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కొత్త సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జనవరి 1, 2024లో ప్రజలకు మేము ఏం చేయబోతున్నమో పూర్తిగా వివరించే కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకున్నారని అన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర స్ఫూర్తిగా ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా గౌరవెళ్లి రిజర్వాయర్ ముఖ్యమంత్రి కుర్చీ వేసుకుని కడుతా అన్నాడని, కానీ కుర్చీ దొరకలేదేమో మరి వారు ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కొత్తకొండ మండల కేంద్రం ఏర్పాటు చేసే అంశం పక్కనపెట్టారని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు మాకు సంపూర్ణంగా తెలుసని, సమస్యల పరిష్కారానికి మేమే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. మొన్న బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి స్వయంగా నేను ముసలివాడిని అయిపోయాను, నేను రిటైర్డ్ అవుతున్నాని ప్రకటించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాటు తెలంగాణ సమాజం బాయ్ బాయ్ కేసీఆర్ అని సాగనంపే పనిలో ఉన్నారని చెప్పారు. భాయ్ భాయ్ కేసీఆర్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు.
బిఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేసారని, తన స్వార్థం కోసం పార్టీని విస్తరించడం కోసం తాపత్రయం పడుతున్నారే తప్ప తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదని విమర్శించారు. ఈరోజు కొన్ని పత్రికల్లో ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ అని రాయడం జరిగిందని, నిన్న మొన్న జరిగిన భూపాల్ పల్లి, స్టేషన్ ఘన్ పూర్ తోపాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో బిఆర్ఎస్ మంత్రులే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ అని వారే చెప్పడం జరిగింది స్పష్టంగా టిఆర్ఎస్ నాయకులు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి టిఆర్ఎస్ తరఫున అని స్పష్టంగా చెప్పారు. సొంత పార్టీ నాయకులే కేసీఆర్ ను ముఖ్యమంత్రి నుంచి దించాలని ఉబలాటపడుతున్నారని అన్నారు. శాశ్వతంగా ప్రజలు ఆయనను ఆ కుర్చీలో నుంచి దింపి ఏదైతే వయసు మీద పడుతుందో కృష్ణ రామా అని శేష జీవితం గడపాలనుకుంటున్నావోతప్పకుండా తెలంగాణ ప్రజలు ఆయన కోరిక తీరుస్తారని చెప్పుకొచ్చారు.
చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ లో అక్కడే పూజలు పునస్కారాలు చేసుకుంటూ వారి శేష జీవితం గడపాల్సిందిగా వారికి మిగతా శేష జీవితంలో ఆయురారోగ్యాలను అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నానని అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ పార్లమెంట్ సభ్యుడైతే పోరాటం చేసి సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల దాడులకు లోనై తిరగబడి బిల్లును పార్లమెంట్లో పాస్ చేయించారు. వారికున్న దుఃఖం బాధ ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి ఇంకెవరికి లేదని చంద్రశేఖర్ రావు కరీంనగర్ పార్లమెంట్ నుండి మూడుసార్లు ఎన్నుకుంటే తెలంగాణకు చేసింది లేదన్నారు. ఈ ప్రాంతానికి పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎన్నుకుంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కాబట్టి వారిని తిరిగి ఈ ప్రాంత ప్రజలు తిరిగి ఎన్నుకోవడం ద్వారా ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ ప్రాంతా అభివృద్ధికి వారు అహర్నిశలు కృషి చేస్తారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే అవసరం ఉన్నది ఈ ప్రాంతాన్ని మండల కేంద్రం చేయడం గాని గౌరవెల్లి లాంటి ప్రాజెక్టుల పూర్తి నిర్మాణాలు చేసి ఈ ప్రాంతానికి శాశ్వతంగా త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. ఈ సందర్భంలో కరీంనగర్ జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలబడి దీవిస్తారని అధికారంలోకి రావడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను.
ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తా అన్నాం చేసాం ఫీజ్ రియంబర్స్మెంట్ నిరుపేదలను డాక్టర్లను ఇంజనీర్లను చేస్తామని చెప్పాం చేసి చూపించిన మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాను ప్రతి మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది ఈరోజు కూడా నిర్దిష్టంగా ప్రజలకు మేము హామీ ఇస్తున్నాము ఆరు నూరైనా వాటన్నిటిని అమలు చేసే విధంగా కృషి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ ఫిరాయింపులకు పాల్పడి కుటుంబ సభ్యుల పదవుల కోసం ప్రజల తీర్పును తాకట్టుపెట్టి వందల ఎకరాలు ఆక్రమించుకున్న భూములు అక్కడే సాండ్ మైండ్ మాఫియా ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతుందో చర్చకు జరిగితే ప్రజలకు తెలుస్తుందని ప్రభుత్వమే వ్యూహాత్మకంగా 144 పెట్టారు మా నాయకుడు గండ్ర సత్యనారాయణ ను అరెస్టు చేసి ఇంట్లో కూర్చోబెట్టిన్లు ఎప్పటికైనా టిఆర్ఎస్ నాయకులకు నేను సూటి సవాల్ విసురుతున్న ఆయన సత్య హరిశ్చంద్రుడు అయితే భూపాల్ పల్లి అంబేద్కర్ చౌరస్తాలో మీడియా మిత్రుల సాక్షిగా బహిరంగ చర్చకు రావాలి వందల ఎకరాలు ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని ఆక్రమించుకున్న భూముల వివరాలు ఇసుక దోపిడి మైనింగ్ దోపిడీ అక్రమ కేసులు అన్నీ కూడా నెగ్గు తేల్చి ప్రజలకు వివరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఏ మాత్రం సిగ్గు ఉన్న ప్రభుత్వం తక్షణమే చర్చలకు అవకాశం కల్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇల్లు పునరుద్ధరించి పేదలకు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని రాజు ఆరోగ్య శ్రీ పథకాన్ని బలోపేతం చేసి ఐదు లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందించాలని ఆనాడు 400కే సిలిండర్ ఇస్తే ఈనాడు 1250 రూపాయలు పెంచి ఆడబిడ్డల ఉసురు కోసుకుంటున్నాడు కాబట్టి 500 కే కాంగ్రెస్ పార్టీ సిలిండర్ ఇవ్వాలని రైతులు చంద్రశేఖర్ మాటలు నమ్మి చేసిన అప్పు బ్యాంకులు చెల్లించకపోవడం వల్ల అసలు మిత్తి కలిసి తడిసి మోపిడై అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి రైతులకు రెండు లక్షల వరకు ఉన్న అప్పులు పూర్తిగా మా ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది ప్రభుత్వం లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేసే నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యచరణ ఉంటుంది నిర్దిష్టమైన సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది 2014లో ఇదే కరీంనగర్ గడ్డపై సోనియా గాంధీ మాట ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం కోసం మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇక్కడే ప్రకటించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బతికి ఉన్న చచ్చిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న కేంద్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఏకైక వ్యక్తి సోనియా గాంధీ అని అన్నారు.




