కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం

  • రాష్ట్ర సమస్యలను ఎన్నికలకు తాకట్టు పెట్టిన బీఆర్‌ఎస్‌ ..
  • ‌జంతర్‌మంతర్‌ ‌వద్ద ధర్నాలో టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 30 : కృష్ణా జలాల్లో రాష్టాన్రికి సరైన న్యాయం జరగడంలేదని కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ అన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న జలవనరుల దోపిడీని అరికట్టాలన్నారు.  రాష్ట్రం ఏర్పడి 8 ఏల్ళైనా నీటి వాటాలు తేల్చకపోవడం దురదృష్టకరమన్నారు. ట్రిబ్యునల్‌ ‌వేసి రాష్ట్ర వాటా తేల్చాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు దిల్ల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద  కోదండరాం మౌన దీక్ష చేశారు. విభజన హాలు, కృష్ణానదీ జలాల సమస్యపై 150 మందితో గంటపాటు ఈ దీక్ష సాగించారు.  కృష్ణా తీర ప్రాంతం 78శాతం తెలంగాణలో ఉందని.. కానీ రాష్టాన్రికి 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో వరద జలాలపై ఆధారపడి ప్రాజెక్టులు నడుస్తున్నాయన్నారు.

ప్రాజెక్టులకు కేంద్రం పర్మిషన్‌ ఇవ్వకపోవడం వల్ల 28 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఆగిపోయిందన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్టాన్రికి అన్యాయం జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ ఆం‌ధ్రాలో కూడా పోటీ చేస్తుంది కాబట్టి రాష్ట్ర సమస్యలపై పోరాటం చేయడంలేదని విమర్శించారు. మంగళవారం దిల్ల్లీలోని కాన్సిట్యూషన్‌ ‌క్లబ్‌ ‌లో  కేసీఆర్‌ ‌పాలనపై సెమినార్‌ ‌నిర్వహిస్తున్నట్లు వివరించారు. విభజన చట్టంలోన10వ షెడ్యూల్‌ ‌లో కీలక అంశాలు ఉన్నాయని.. 9 ఏళ్లుగా వాటిపై దృష్టి పెట్టలేదని కోదండరాం విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, పారిశ్రామిక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అడగకపోవడంతో కేంద్రం పట్టించుకోలేదన్నారు. రెండు రాష్టాల్ర అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఏ అంశం అమలుకాలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *