14 ఆత్మ గౌరవ సంఘల భవనాలు
విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27 రాష్ట్రంలో కుల సంఘాల అభ్యునితికి కోసం పెద్ద పీట వేస్తూ ఆత్మ గౌరవ సంఘ మంజూరు చేస్తున్న సి ఎం కే సి ఆర్ కు విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దాన్యవాదాలు తేలిపారు.బుధవారం మహేశ్వరం మండలంలో 90 లక్షల రూపాలయల నిధులతో వీర శైవ లింగాయత్,గాండ్ల సంఘం,ఆర్యవైశ్య సంఘం,మున్నూరు కాపు సంఘం,అరకటికే, బుడగజంగాలు,గంగ పుత్ర,సగర(ఉప్పరి) సంఘం,పద్మశాలి, 9 కుల సంఘాలకు నిర్మించే ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూన్నార న్నారు.అదే స్ఫూర్తితో నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నట్లుతెలిపారు.ఒకే రోజు సుమారు 10 కుల సంఘాలకు 1 కోటి 5 లక్షలతో మహేశ్వరం మండలం లో శ్రీకారం చుట్టిందన్నారు. కుల వృత్తుల వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.బీసీ ల్లోని కుల చేతి వృత్తుల వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సహాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
‘‘విద్యకు పెద్ద పీట’’
తెలంగాణ రాష్ట్రంలో సి ఎం కె సి ఆర్ విద్యకు ప్రాధానం
కల్పించుచున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు
మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో 26 కోట్ల వ్యయంతో నిర్మించే పాలిటెక్నిక్ కలశాల భవనానికి శంకుస్థాపన చేసారు.మహేశ్వరం మండలంలో స్థానిక నిరుద్యోగ యువత కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేస్తామన్నారు. ఫాక్స్ కాన్ సంస్థ నేడు మరింతగా పెట్టుబడులు పెంచిందని, 9 నెలల్లో ప్రారంభం కానుందని, లక్ష మందికి ఉపాధి లభిస్తుందని,స్థానిక యువతకు అవకాశాలు లభిస్తాయన్నారు.ఈ ప్రాంతం వరకు మెట్రో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 6600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసారని తద్వారా ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు.తెలంగాణ భవిష్యత్తు కు కేసీఆర్ వెంటే ఉండాలని,బిఆర్‌ఎస్ ను ఆదరించాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి,ఎం పి పి సునీత అంధ్యా నాయక్,మన్సనపల్లి సర్పంచ్ కంది అరుణ రమేష్,మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, పి ఎ సి ఎస్ ఛైర్మన్ పాండు నాయక్,మండల పార్టీ అద్యక్షుడు రాజు నాయక్,మల్లేష్ యాదవ్ ,చంద్రయ్య,కుల సంఘాల ప్రతినిధులు శివ కుమార్, మోదిని శ్రీశైలం, ఓంకార్, అయిళ్ల లక్ష్మయ్య, మక్కాజీ,రాజలింగం,అల్లె కుమార్, ఉప్పరి రవి, చెరుకు శ్రీను, బి ఆర్ ఎస్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య, మునగపాటి నవీన్, శివ మూర్తి,నిమ్మగూడెం సుధీర్ గౌడ్ , కడమోని ప్రభాకర్,అధిల్ అలీ,సంజీవ తదితరులు పాల్గొన్నారు



