రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి విడుత జాబితా ఆదివారం విడుదల చేసింది. 55 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేయగా..పార్టీ ప్రముఖులు, ఇటీవల పార్టీలో చేరిన కొందరి పేర్లు ఇంకా ప్రకటించలేదు. ప్రకటించిన పేర్లు వారు పొట్టే చేయబోయే నియోజక వర్గాలు…
బెల్లంపల్లి (ఎస్సీ)- గడ్డం వినోద్, మంచిర్యాల – ప్రేమ్ సాగర్, నిర్మల్ – శ్రీహరి రావు, ఆర్మూర్ – వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ – సుదర్శన్ రెడ్డి, బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల, జగిత్యాల – జీవన్‌రెడ్డి, ధర్మపురి (ఎస్సీ)-అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం – రాజ్ ఠాకూర్, మంథని – శ్రీధర్ బాబు, పెద్దపల్లి – విజయ రమణారావు, వేములవాడ – ఆది శ్రీనివాస్, మానకొండూరు (ఎస్సీ) – కవ్వంపల్లి సత్యనారాయణ, మెదక్ – మైనంపల్లి రోహిత్, ఆందోల్ (ఎస్సీ) – దామోదర రాజనర్సింహ్మ, జహీరాబాద్ (ఎస్సీ) – ఏ చంద్రశేఖర్, సంగారెడ్డి – జగ్గారెడ్డి, మేడ్చల్ – తోటకూర వజ్రీస్ యాదవ్, మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు, గజ్వేల్ – నర్సారెడ్డి, కుత్బుల్లాపూర్ – హన్మంత్ రెడ్డి, ఉప్పల్ – పరమేశ్వర్ రెడ్డి, చేవేళ్ల – భీమ్ భరత్, పరిగి – రాంమోహన్ రెడ్డి, వికారాబాద్ – గడ్డప్రసాద్, ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్, మలక్ పేట – షేక్ అక్బర్, సనత్ నగర్ – నీలిమా, నాంపల్లి – ఫిరోజ్ ఖాన్, కార్వాన్ – మహ్మమద్ అల్ హజ్రీ, గోషామహల్ – మోగిలి సునీత, చంద్రాయణగుట్ట – బోయ నగేశ్, యాకత్ పుర – రవి రాజు, బహదూర్ పూర్ – రాజేశ్ కుమార్, సికింద్రాబాద్ – సంతోష్ కుమార్, కొడంగల్ – రేవంత్ రెడ్డి, గద్వాల్ – సరితా తిరుపతయ్య, అలంపూర్ (ఎస్సీ) – సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, అచ్చంపేట (ఎస్సీ) – వంశీకృష్ణ, కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్ నగర్ – శంకరయ్య, కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు, నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి, హుజుర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ – ఉత్తమ్ పద్మావతి రెడ్డి, నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ (ఎస్సీ) – వేముల వీరేశం, ఆలేరు – బీర్ల ఐలయ్య, ఘన్ పూర్ – సింగాపురం ఇందిరా, నర్సంపేట – దొంతి మాధవరెడ్డి, భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ, ములుగు(ఎస్టీ) – సీతక్క, మధిర (ఎస్సీ) – భట్టి విక్రమార్క, భద్రాచలం(ఎస్టీ) – పొదెం వీరయ్య. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో ఓసీలకు 26 సీట్లు దక్కాయి. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి 17 సీట్లు వచ్చాయి. వెలమ వర్గానికి 7 సీట్లు, బ్రాహ్మణ వర్గానికి 2 సీట్లు దక్కాయి. మైనార్టీలకు 3 సీట్లు ఇవ్వగా… బీసీలకు 12 సీట్లు ఇచ్చారు. ఎస్సీలకు 12, ఎస్టీలకు 2 సీట్లు స్థానాలు ఖరారు చేశారు. తొలి జాబితాలో ఐదుగురు మహిళలకు టికెట్లు వచ్చాయి. పార్టీలో కొత్తగా చేరిన 11 మందికి సీట్లు ఖరారయ్యాయి. నాగర్ కర్నూల్ టికెట్ ఆశించిన నాగం జనార్థన్ రెడ్డికి టికెట్ దక్కలేదు. పాలేరు, మిర్యాలగూడ సీట్ల కోసం సీపీయం చర్చలు జరుపుతోంది.
కాంగ్రెస్ పార్టీ 55 అభ్యర్థుల జాబితా విడుదల

మొదటి జాబితాలో రేవంత్, భట్టి , కోమటిరెడ్డి ,ఉత్తమ్, శ్రీధర్ బాబు , సీతక్క , పద్మావతి ,వేముల వీరేశం
ప్రకటించని పాలేరు ,ఖమ్మం ..
రెండు ,మూడు రోజుల్లో మరో జాబితా




