సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారు
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 19: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆరు గ్యారెంటీ లతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పల్లవి శివానంద్ కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్చార్జీలు మిద్దె రాములు హాజీ పాష ఆనంద్ ఖాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను తీరని మోసానికి గురిచేసారన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇక వికారాబాద్లో అయితే ఎమ్మెల్యే ఆనందు అభివృద్ధికి నిధులు తీసుకురాకుండా అభివృద్ధి చేసే మున్సిపల్ చైర్మన్కు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రసాద్ కుమార్ ను గెలిపించుకుంటే అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యపడుతుందని ఆమె ప్రజలకు వివరించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం విశ్వాసం పెరిగిందని కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి పరశురాం నాయక్ మల్లికార్జున్ గౌడ్ డి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



