- తనను ఏమాత్రం పట్టించే కోవడం లేదని ఆవేదన
- చాలా కాలం నుంచి అవమానాలు ఎదుర్కుంటున్నట్లు వెల్లడి
- విల్లాలు, డబ్బులిచే వారికే పార్టీ టికెట్లంటూ ఆరోపణ
- 16న బిఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధం..?
జనగామ, ప్రజాతంత్ర, ఆక్టోబర్ 13 : కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టిపిసిసి మాజీ ఆధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆధిష్టానికి లేఖ పంపారు. ఆయన ఈ నెల 16వ తేదిన జనగామలో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసిఆర్ సమక్షంలో బిఆర్‌యస్‌లో చేరనునట్లు సమాచారం. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ… పివి నరసింహరావు పిలుపుమేరకు తను కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలను నమ్మి పార్టీలో చేరడం జరిగిందన్నారు. 4 దశాబ్ధాలుగా క్రియశీల కార్యకర్త నుంచి టిపిసిసి ఆధ్యక్షుని వరకు అనేక కీలక పదవులను పొందడం జరిగిందన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది 12 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆందప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేయడం జరిగిందన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలిసివేస్తున్నాయని 2015లో టిపిసిసి ఆధ్యక్ష పదవి నుండి అకారణంగా తనను తొలగించారన్నారు. రేవంత్‌రెడ్డి కొత్తగా వొచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తూ అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
టిపిసిసి ఆధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా..బయట కలిసినా కూడా మాట్లాడకుండా అనేక సార్లు ఆవమానించడం జరిగిందన్నారు. 50శాతం పైగా ఉన్న బిసిలకు టికెట్ ఇవ్వాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్‌ను కలువడానికి దిల్లీకి వెళ్లి పది రోజులు ఉన్న కూడా కనీసం ఒక్క నిమిషం సమయం కూడా కేటాయించలేదన్నారు. తెలంగాణ అంటే ఆత్మ గౌరవానికి ప్రతీక అని తెలంగాణ కోసం 44 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సంతకాలు పంపిన వారిలో తను మొదటి సంతకం పెట్టిన వాడినన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పగ్గాలు అప్పగిస్తే వాళ్ళు బజారులో పశువులను అమ్మినట్లు పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారన్నారు. ఆభ్యర్థుల ఎంపికలో అనేక ఆవకతవకలు జరుగుతున్నయని డబ్బులు, విల్లాలు, బంగారం ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు.
ఇలాంటి దారుణమైన పరిస్థితిలో పార్టీలో ఆవమానాలు భరిస్తూ మనుగడ సాదించలేమన్న ఆవేదనతో తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేయడం జరిగిందన్నారు. పొన్నాల రాకతో బిఆర్‌యస్ ఆభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి లక్ష మెజారీటీతో గెలుపొందడం ఖాయమాని పలువురు చర్చిచుకోవడం జరుగుతుంది. జనగామ నియోజకవర్గంలో పొన్నాల అంటూ ఒక్క వర్గం ఉందని, గతంలో మూడు పర్యాయాలుగా మంత్రిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగి ప్రజలతో సంబంధాలు ఉన్నాయనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి. పల్లాకు నియోజకవర్గం కలిసి వొచ్చే ఆవకాశలే నిండుగా ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతుంది. 45 యేండ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అనేక పదవులు ఆనుభవించి కాంగ్రెస్ క్యాడర్‌కు కొండంతా అండగా నిలిచిన పొన్నాల పార్టీకి రాజీనామా చేయడం, కంటతడిపెట్టడం పలువురిని కలిసివేసింది. డబ్బు సంచులకు పదువులు అమ్ముకోవడం ఇది ఎక్కడి సంప్రాదాయం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైన పొన్నాల రాజీనామాతో కాంగ్రెస్‌కు పెద్ద నష్టమేనని ఆంగికరించక తప్పదు.





