ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : మాడ్గుల మండలం లోని పక్కిర తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని బాలు తాండ మాడుగుల ఎంపీపీ గౌరవరం పద్మరెడ్డి, కల్వకుర్తి తాలుక అభివృద్ధి సాధన కమిటీ చైర్మన్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ లతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ హమిలను ప్రజలకు విన్నవించారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నారాయణరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రవి నాయక్, లాలు నాయక్, గోరియ్య, హనుమాంత్, రాంజా, ఠాగూర్, వాసు, సంతోష్, మోత్య, బావోజీ, శంకర్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి గౌని సురేష్ గౌడ్, యాచారం శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కసిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం





