ప్రొ:అజయ్ గుడవర్తి జె.ఎన్.యూ న్యూదిల్లీ
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా ఈ దేశంలో మతం పేరుతో రాజకీయాలు శాసిస్తున్నారని జే.ఎన్.యూ న్యూదిల్లీ కి చెందిన ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి అన్నారు.తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో ఆచార్య జయశంకర్ 12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు లో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న పాలకులు సహనాన్ని కోల్పోయి అశాంతి అలజడులను సృష్టిస్తున్నారన్నారు.భారతదేశం లో అసహనం తో ఆర్ఎస్ఎస్ బిజెపి మూలాలను రక్షించినట్లుగా నటిస్తుందన్నారు.సంస్కృతిని ప్రత్యామ్నాయ ఉద్యమాలు సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల పాలకవర్గాలు సంస్కృతిని తమ ఎజెండాలో చేర్చుకున్నందుకు వారికి ఈ రోజు ఒక లెజిటిమసీ వచ్చింది అన్నారు.కల్చర్ ని ప్రత్యామ్నాయ ఉధ్యమాలు సీరియస్ గా తీసుకొని అందులో భాగంగా కామన్ స్కూల్ విధానాన్ని ఎజెండా గా చేర్చాలన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ కల్చర్ ను వాడుకుంటూ దానిని ఐడెంటిటీగా ప్రోజెక్ట్ చేసి ప్రజలలో ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నారన్నారు.ఇది మొత్తం కూడా రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం కోసమే అన్నారు.




