కరెంట్‌ ‌కోతలు లేవు… ఎక్కడ చూసినా వరి కోతలు..!

  • తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతి దేశానికి రోల్‌ ‌మోడల్‌
  • ‌తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలకన్నా ముందున్నాం
  • మిషన్‌ ‌భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు అందించాం
  • మిషన్‌ ‌కాకతీయ వందశాతం సక్సెస్‌ ‌చేశాం
  • గృహలక్ష్మి కింద ఇంటికి మూడు లక్షలు అందిస్తాం
  • గన్‌పార్క వద్ద అమరులకు నివాళి..
  • సచివాలయంలో జెండా ఆవిష్కరణలో సీఎం కెసిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 :‌రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్‌ ‌కోతలు లేవని ఎటు చూసిన వరి కోతలే ఉన్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.  తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర అవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. 60 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా విద్యుత్‌ ‌సమస్యను పరిష్కరించలేదని, కానీ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన కొద్దిరోజుల్లోనే తాము ఆ సమస్యకు పరిష్కారం చూపించామని అన్నారు. ఇప్పుడు చూస్తున్న తెలంగాణ నవీన తెలంగాణ, నవనవోన్మేష తెలంగాణ అని విశ్లేషిం చారు. దేశంలో ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్‌ ‌మారు మాగుతుందన్నారు. జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి మన్ననలు అందుకుంటోంది. ఇందులో భాగమైన ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులు, యంత్రాగాన్ని అభినం దిస్తున్నాను. తెలంగాణ పథకాలు ఇతర రాష్టాల్రకు ఆదర్శం, ఆచరణీయ మ య్యాయి. తమ రాష్టాల్ల్రో వీటిని అమలు చేస్తామని చాలా మంది నేతలు, సీఎంలు చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో క్రాఫ్‌,‌పవర్‌ ‌హాలీడేలు లేవని  చెప్పారు. తలసరి ఆదాయంలో పెద్ద రాష్టాల్ర కంటే తెలంగాణ ముందంజలో ఉందని చెప్పిన సీఎం.. ఇతర రాష్టాల్ర ప్రజలు కూడా తెలంగాణ మోడల్‌ ‌ను కోరు కుంటున్నారని చెప్పారు.  ఇంటింటికి నళ్లా నీళ్లిచ్చి మాట నిలబెట్టుకున్నామని,  మిషన్‌ ‌కాకతీయ వందశాతం సక్సెస్‌ అయిందని తెలిపారు.  దళితభందు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు.

గృహలక్ష్మీ  పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు త్వరలోనే అందస్తామని కేసీఆర్‌ ‌తెలిపారు.  జూలై నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.  పోడు భూములు అందిచాక వారికి కూడా రైతుబంధు  పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. సెక్రటేరియట్‌లో సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసీఆర్‌ ‌తో పాటు సీఎస్‌ ‌శాంతి కుమారి ఉన్నారు. అంతకుముందు గన్‌పార్క్ ‌దగ్గర అమర వీరుల స్థూపానికి  సీఎం కేసీఆర్‌  ‌నివాళులర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు.  సీఎం కేసీఆర్‌ ‌తో పాటు సీఎస్‌ ‌శాంతికుమారి, డీజీపీ అంజన్‌ ‌కుమార్‌,  ‌ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు నివాళి అర్పించారు.ప్రగతి భవన్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రదశాబ్ది వేడుకలను నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరపనున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు సీఎం కేసీఆర్‌ ‌నివాళి అర్పించారు. ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు నమస్కరించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పాలన సాగిస్తుందన్నారు. ప్రతి రంగంలో దేశం నివ్వెరపోయే ఫలితాలు సాధించి ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు సీఎం. అందుకే తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను స్మరించుకోవడానికి 22 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఉద్యమ సమయంలోనే కాదు పాలన కాలంలో కూడా ప్రజలు చాలా సహకరించారన్నారు.  తెలంగాణ సమాజం ఆరు దశాబ్దాలు పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించుకుందన్నారు. తెలంగాణ వచ్చే నాటికి అన్ని రంగాల్లోనూ విధ్వంసం కనిపించిందన్నారు. వాటిన్నింటిని అధిగమించి దేశంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందన్నారు. ధ్వంసమైన రంగాలను చక్కదిద్ది వాటిని ప్రగతి పథంలోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం నిజాయితీగా శ్రమించిందన్నారు. సమైక్య పాలకులు అనుసరించిన వివక్షాపూరిత విధానాలను మార్చేయడానికి సిద్దమయ్యామన్నారు. తెలంగాణ పునరన్వేషణ, పునర్నిర్మించుకోవాలనే నినాదంతో ముందడుగు వేశామన్నారు. నూతన విధానాలకు రూపకల్పన చేసినట్టు పేర్కొన్నారు. ప్రజల తక్షణ అవసరాలు, వనరులు, వాస్తవాలు,అందులోబాటు ఉన్న పరిస్థితులు ఆధారంగా వివిధ చట్టాలు, ప్రణాళికలు, మార్గదర్శకాలను రూపొందించామని వివరించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తాను చెప్పిన మాటలను సీఎం కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. తెలంగాణ రాష్టాన్న్రి చూసి దేశం నేర్చుకనే విధంగా తలమానికంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతానని హా ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఎప్పుడూ విస్మరించలేదు. ఏ మాత్రం చెదరినివ్వలేదు. ఇప్పుడు అదే నిజమైంది. దేశానికి స్ఫూర్తినిచ్చే రాష్ట్రంగా ఆవిర్భవించింది.

ఉద్యమం సమయంలో ప్రజలు వ్యక్తపరిచిన ఆకాంక్ష పట్ల బీఆర్‌ఎస్‌కు సంపూర్ణ అవగాహన ఉందన్నారు కేసీఆర్‌. ‌వాటికి అనుగుణంగానే మేనిఫెస్టోను  రూపొందించుకొని అమలు చేశామన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భఁగా నాటి పరిస్థితులు నేడు చూస్తున్న విజయాలు బేరీజు వేసుకుంటే సాధించిన ప్రగతి అర్థమవుతుందన్నారు. 9 ఏళ్ల వ్యవధిలో కరోనా కారణంగా మూడేళ్లు వృథా పోయిందన్నారు. మిగిలిన కాలంలోనే వాయువేగంతో ప్రగతి పథంలోకి వచ్చామని కెసిఆర్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ ‌వద్ద తెలంగాణ అమర వీరులకు సీఎం కేసీఆర్‌ ‌నివాళి అర్పించారు. అక్కడ పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సచివాలయానికి చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *