ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ నీ అభివృద్ధి చేసి చూపిస్తా  బండారి లక్ష్మారెడ్డి 

 ఉప్పల్,   ప్రజాతంత్ర, నవంబర్ 23:  ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ నీ అభివృద్ధి చేసి చూపిస్తా నని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.గురువారండా ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో పాదయాత్ర లో  భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూకేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ చాలా అభివృద్ది చెందిందని, ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.  డివిజన్ లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగాఅభ్యర్ధి  బండారి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూకేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ చాలా అభివృద్ది చెందిందన్నారు. ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. కేసీఆర్  మూడవసారి ముఖ్యమంత్రి అయితే భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు లక్ష్మారెడ్డి ని విజయోస్తు అని దీవించి ఉప్పల్ నియోజకవర్గంలో  కారు గుర్తుకు ఓటేసి  బండారి లక్ష్మారెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపిస్తామని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.లక్ష్మారెడ్డి   తనకు మద్దతు తెలిపిన అసోసియేషన్ ల కు ధన్యవాదాలు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  బి ఆర్  ఎస్ రాష్ట్ర నాయకులు సోమ శేకర్ రెడ్డి,స్థానిక కార్పొరేటర్ శిరీష సోమ శేకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామరావు, పావని రెడ్డి,డివిజన్ ప్రెసిడెంట్ కాసం మహిపాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కుమార స్వామి,నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *