ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసిన మైన్స్ ఏడి జాకబ్

తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: తాండూరు ఎమ్మెల్యే బుయానిమన్నారెడ్డిని తాండూర్ మైన్స్ ఏడి జాకాబ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాముల్ జకాబ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలని తాండూరు అభివృద్ధికి అధికారుల సహకారం ఉండాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *