ఎన్డీటీవీని చేజిక్కించుకున్న ఆదానీ

ఫౌండర్‌ ‌ప్రమోటర్స్ ‌ప్రణయ్‌ ‌రాయ్‌, ‌రాధికా రాయ్‌ల రాజీనామా

న్యూదిల్లీ,నవంబర్‌30 : ఎన్డీటివి ఆదాని గ్రూపు కిందకు చేరింది. న్యూఢిల్లీ టెలివిజన్‌ ‌లిమిటెడ్‌ ‌ఫౌండర్స్ ఎ‌ప్రమోటర్‌ అయిన ప్రణయ్‌  ‌రాయ్‌, ‌రాధికారాయ్‌లు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు.  రాయ్‌  ‌దంపతులకు ప్రస్తుతం 32.26 శాతం వాటాలు ఉన్నట్లు సమాచారం.  వీరు రాజీనామా చేసిన వెంటనే అదానీ గ్రూప్‌కి చెందిన సుదీప్త భట్టాచార్య, సంజయ్‌  ‌పుగాలియా, సెంథిలి సిన్నయ్‌ ‌చెంగల్వరాయన్‌లను బోర్డు డైరెక్టర్లుగా నియమించింది. ఈ వారం ప్రారంభంలో వీరు డియాను స్వాధీనం చేసుకున్నారు. రాయ్‌  ‌దంపతుల రాజీనామాలతో పాటు నూతన డైరెక్టర్ల  నియామకాలను మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎన్‌డిటివి మెజార్టీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్‌  ‌దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. దీంతో.. ఎన్‌డిటివి అదానీ గ్రూప్‌ ‌సొంతమైంది. ఎన్‌డిటివి ప్రమోటింగ్‌ ‌కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ ‌హౌల్డింగ్స్ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు. ఎన్‌డిటివిలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్‌ ‌ద్వారా ఈ డియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ‌ప్రకటించింది. నవంబర్‌ 22‌న ప్రారంభమైన ఈ ఆఫర్‌ ‌డిసెంబర్‌ 5‌న ముగియనుంది.  మొత్తంగా ఎన్‌డిటివిలో ప్రస్తుతం అదానీ గ్రూప్‌ 55.18 ‌శాతం వాటా దక్కించుకుంది. అయితే తమ సమ్మతి లేకుండానే అదానీ గ్రూప్‌ ‌టేకోవర్‌ ‌చర్యలు చేపట్టిందని ఎన్‌డిటివి పేర్కొంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *