ఉమ్మడి పౌరస్మతిపై విపక్షాల విమర్శలు

న్యూ దిల్లీ, జూన్‌ 28 : ‌దేశంలో ఉమ్మడి పౌరస్మ•తిని అమలు చేయాలని, కానీ ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ మేరకు భోపాల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది దేశ బహుళత్వం, వైవిధ్యాన్ని దెబ్బతీయడమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్‌, ‌డీఎంకే, ఏఐఎంఐఎం పార్టీలు ఆరోపించాయి.

మణిపూర్‌లో జరుగుతున్న హింస గురించి ప్రధాని ఏ మాట్లాడలేదని, ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి ఎటువంటి మాట చెప్పలేదని, కానీ యూసీసీ అమలు గురించి ఆయన ప్రస్తావించడం సరైందికాదు అని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఉమ్మడి పౌరస్మ•తిపై ముస్లిం వర్గాన్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధాని తన ప్రసంగంలో ఆరోపించారు. ప్రజలకు రెండు రకాల రూల్స్ ఉం‌టే ఒక కుటుంబం ఎలా పనిచేస్తుందని, అప్పుడు దేశం ఎలా పనిచేస్తుందని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *