ఇగోలతో పాలన చేయలేం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈగో పర్సన్‌ అని సినీ నటి, బీజేపీ నేత  కుష్బూ అన్నారు. ఒక లీడర్‌కు ఈగో ఉండకూడదని ఆమె తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గోనడం సంతోషంగా ఉందన్నారు కుష్బూ. రాజకీయపరంగా ఎలాంటి  విభేదాలున్నా.. ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర సీఎంగా ఆయనను రిసీవ్‌ ‌చేసుకోవడం సంస్కారమందన్నారు.

తెలంగాణలో 2023లో బీజేపీ కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. అటు వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో కూడా బీజేపీ గవర్నమెంట్‌ ‌ఫామ్‌ ‌చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్‌ ‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌ ‌పోర్టుకు చేరుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *