ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులె •1 :ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండని కేటీఆర్ సూచించారు. పార్టీ డీఎన్‌ఏలోనే విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అని తెలుసు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదు. అభివృద్ధి విషయంలో మీ పార్టీ నూతన ప్రారంభం చేయడానికి తెలంగాణకు మించిన ప్రదేశం ఇంకొకటి లేదు. తెలంగాణ ప్రాజెక్టులు, పథకాలు , సుపరిపాలన విధానాలు ప్రాధాన్యతలను అధ్యయనం చేయండని సూచించారు. అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకండి.. మత సామరస్యంతో కూడిన వసుదైక కుటుంబం లాంటి సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండని మోదీకి కేటీఆర్ సూచించారు.
గూగుల్‌ను అడిగితే తెలంగాణ గొప్పతనం తెలుస్తుంది: కెటిఆర్ తాజా ట్వీట్
ఒంటికాలుపై స్కూలుకు వెళుతున్న బాలిక :వివరాలు చెబితే సాయం అందిస్తానన్న కెటిఆర్
గూగుల్‌లో సర్చ్ చేస్తే తెలంగాణగొప్పతనమేంటో తెలుస్తుందని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే గుగూల్‌ని అడగండంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఎక్కడ ఉంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రెండింటికి సమాధానం తెలంగాణనే అని, వాటిని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించడం గర్వకారణంగా ఉందని మంత్రి తన ట్వీట్ లో పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఐటీ వరకు తెలంగాణ అగ్రభాగాన ఉందని కేటీఆర్ ట్వీట్ లో తెలిపారు. అభివృద్దిలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు.
ఒంటికాలుపై స్కూలుకు వెళుతున్న బాలిక : వివరాలు చెబితే సాయం అందిస్తానన్న కెటిఆర్
బీహార్‌లో ఒంటికాలిపై స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థిని సంఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వీడియోను రీ ట్వీట్ చేసిన కేటీఆర్.. ఆ అమ్మాయి వివరాలు ఎవరి దగ్గర నైనా ఉంటే తనకు తెలియజేయాలని కోరారు. అమ్మాయి కల సాకారం కావడం కోసం వ్యక్తిగత సామర్థ్యం మేరకు తన వంతు సాయం చేస్తానన్నారు. బీహార్ లోని సివాన్ జిల్లా జముయి పట్టణానికి చెందిన ప్రియాంశు కుమారి ఒంటి కాలిపై స్కూల్‌కు వెళ్తుంది. కృత్రిమ కాలు లేదు..అనే విషయాన్ని పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచి స్కూల్ కు వెళ్లొస్తుంది.నాకు చదువంటే ప్రాణం.. డాక్టర్ కావాలనేది జీవిత లక్ష్యం. నా కలలను చంపుకోలేను. ప్రభుత్వం స్పందించి కృత్రిమ కాలును అందించి నన్ను ఆదుకోవాలి. జీవిత ఆశయాలకు ఊపిరి పోయాలని ప్రియాంశు విజ్ఞప్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు సన్నకారు రైతులు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో తమ కూతురికి కృత్రిమ కాలును కొనిచ్చే స్థోమత వారికి లేదు. ఆమె కాలినడకన బడికి వెళ్తున్న వీడియోను ఏఎన్‌ఐ వార్తాసంస్థ ట్విటర్‌లో షేర్ చేసింది. దీనిపై నెటిజన్స్ విశేషంగా స్పందించారు. అవసరమైతే తామే ఆర్థికసాయం చేస్తామంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. దీనికి కెటిఆర్ కూడా స్పందించి సాయం చేయడానికి సిద్దమని ప్రకటించారు.




