ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : అమనగల్లు మున్సిపాలిటీ 15వ వార్డులో బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గం అభ్యర్థి ఆచారి గెలుపు కోసం ఆమనగల్లు మున్సిపాలిటీ పాలకవర్గం కార్యకర్తలు నాయకులు అభిమానులు గడప గడపకు వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురుంచి.. బీజేపీ కల్వకుర్తి అభ్యర్థి తల్లోజు ఆచారి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరిస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి ఆచారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్,మున్సిపాలిటీ అధ్యక్షుడు
శ్రీకాంత్ సింగ్, బూత్ అధ్యక్షుడు ముక్కెరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి టిల్లు యాదవ్, నాయకులు బైకని శ్రీశైలం, జెనిగల గిరి, వడ్డే రాజు, నాగిళ్ళ లక్ష్మణ్, చెన్నకేశవులు, జెజ్జాల గిరి, గజ్జె లక్ష్మీపతి, ఉమేష్, శివ, ఏకుల శ్రీను, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు.




