అన్ని మతాలు కాంగ్రెస్‌కు సమానమే

కైస్త్రవుల హక్కులు కాపాడుతాం: మంత్రి పొన్నం

సిద్దిపేట,డిసెంబర్‌23 : ‌కైస్త్రవుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి వారి హక్కులను కాపాడుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. శనివారం నాడు హుస్నాబాద్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ ‌వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కైస్త్రవులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జె పాటిల్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ… అన్ని మతాలను కాంగ్రెస్‌ ‌పార్టీ గౌరవిస్తుంది. రాష్ట్రంలో ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ కార్యక్ర మాలన్ని అమలు చేస్తాం.

హుస్నాబాద్‌లోని మోడల్‌ ‌స్కూల్‌ ‌లో విద్యార్థులకు కారం పెట్టిన ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.హుస్నాబాద్‌లో మెడికల్‌ ‌కాలేజ్‌, ఆర్టీవో కార్యాలయం ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నామన్నారు. హుస్నాబాద్‌ ‌మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, భూ నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేలా కృషి చేస్తానని చెప్పారు. హుస్నాబాద్‌ ‌నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయనని అన్నారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్‌ ‌ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. 24 గంటలు నియోజర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *