పట్టాలు సమాంతరంగా ఉంటేనే
గమ్యం ఎంత దూరమైనా
రైలు గమనం సాగుతుంది
గమ్యం చేరువవుతుంది
పక్షి చిన్నదైనా పెద్దదైనా
సమన్వయంతో రెక్కలార్చితేనే
స్వేచ్ఛగా గాలిలో
ఎక్కడికైనా ఎగురుతుంది
కాళ్లు రెండైనా నాలుగైన
అడుగు వెనక అడుగు వేస్తేనే
ముళ్ళ బాటైనా పూల బాటై
ముందుకు సాగుతుంది
నేత్రమైన మనోనేత్రమైన
ఇలలోనైనా కలలోనైనా
గోచరించే దృశ్యాలెన్నైనా
నిలుపుకున్నదృశ్యన్నే చూస్తుంది
శ్వేత వర్ణ రవి కిరణం
రుజుమార్గంలో పయనించిన
కాంతి విక్షేపణం చెందితేనే
సప్తవర్ణం గోచరిస్తుంది
మనస్సు స్వేచ్ఛా విహంగం
భవ బంధాల సంకెళ్లు తెంచుకొని
అనంత దిక్కుల సంచరించిన
తొలుగుతాయి అజ్ఞాన తిమిరాలు !
– పి.బక్కారెడ్డి, 97053 15250




