అగ్నిపథ్‌ ‌పథకం వెనక్కి తీసుకోవాలి ప్రతిపక్షాల డిమాండ్‌

ప్రతిపక్షాల డిమాండ్‌
‌న్యూ దిల్లీ, జూలై 11 : అగ్నిపథ్‌ ‌పథకాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌తో జరిగిన రక్షణ రంగ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ప్రతిపక్షాలు ఈ డిమాండ్‌ ‌చేశాయి. రాజ్‌నాథ్‌ను కలిసిన వారిలో టీఎంసీకి చెందిన సుదీప్‌ ‌బంధోపాధ్యాయ్‌, ‌సౌగతారాయ్‌, ఎన్సీపీకి చెందిన రజ్నీ పాటిల్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన శక్తిసింగ్‌ ‌గోహిల్‌, ఆర్జేడీకి చెందిన ఏడీ సింగ్‌, ‌బీజేపీకి చెందిన రంజన్‌బెన్‌ ‌భట్‌ ‌రామ్‌భాయ్‌ ‌మొఖారియా ఉన్నారు.

అగ్నిపథ్‌ ‌స్కీమ్‌పై లోతుగా చర్చించారు. స్కీమ్‌ను వెనక్కు తీసుకోవడం లేదా పార్లమెంట్‌ ‌పరిశీలనకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కోరారు. అగ్నిపథ్‌ ‌స్కీమ్‌ ఉద్యోగాల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయంటే ఎక్కువ నిరుద్యోగిత ఉందని అర్థమని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. సమావేశంలో ఆర్మీ చీఫ్‌ ‌మనోజ్‌ ‌పాండే, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ‌హరికుమార్‌ ‌త్రివిధదళాలకు చెందిన ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *