అగ్నిపథ్‌ ‌పథకం వెంటనే రద్దు చేయాలి

కేంద్రం తీరుతోనే దేశవ్యాప్తగా నిరసనలు

కేంద్రంపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఫైర్‌

‌వరంగల్‌కు వెళ్లకుండా రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు

వాహనం కదలకుండా అడ్డుపడ్డ శ్రేణులు

అరెస్ట్‌తో ఘట్‌కేసర్‌ ‌వద్ద స్వల్ప ఉద్రిక్తత

రాకేశ్‌ ‌శవయాత్రలో పాల్గొనకూడదా..అడ్డుకోవడంలో అర్థం ఉందా అని రేవంత్‌ ‌‌ప్రశ్న

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే..యువకులు బలవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అన్ని విధాలా ఆలోచించి చర్చించి తీసుకురావాల్సిన అగ్నిపథ్‌ ‌సర్వీసును…కేంద్రం హడావిడిగా తీసుకొచ్చిందని ఆయన అన్నారు. సైనికులను నాలుగేళ్ల తాత్కాలిక ప్రాతిపదికన నియమించడం దారుణమన్న రేవంత్‌రెడ్డి…కేంద్ర సర్కార్‌ అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సైన్యంలో చేరికలను ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌ద్వారా చేపట్టడాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అందులో భాగమే సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటన అని చెప్పారు. అగ్నిపథ్‌పై దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమన్నారు. రైతులు దేశానికి వెన్నెముక అని..సైనికులు దేశ రక్షణ అనే గొప్ప సందేశాన్ని కాంగ్రెస్‌ ఇచ్చిందని రేవంత్‌ ‌గుర్తు చేశారు. పార్లమెంట్‌లో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలను..చట్టాలు చేసిన తర్వాత పార్లమెంట్‌లోకి తీసుకొస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకొని..పరీక్షలకు సిద్ధమైన యువకుల పట్ల మోదీ ప్రభుత్వం నిరంకుశత్వ వైఖరితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. అయితే వరంగల్‌ ‌వెళుతున్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జిల్లాలోని ఘట్‌కేసర్‌ ‌వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్‌ ‌కుంటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బయలుదేరారు. కాగా ఘట్‌కేసర్‌లో రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ చీఫ్‌ ‌సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్‌ ‌శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ ‌నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘర్షణలో ఒకరు చనిపోవడంతో పాటు ఐదుగురికి గాయాలయ్యాయని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధితులను పరామర్శించకుండా అమిత్‌షా దగ్గరకు వెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలోనే సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌లో అల్లర్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో..కాంగ్రెస్‌ ‌పిలుపునిస్తే తెరాస, ఎంఐఎం దాడి చేశాయా అని నిలదీశారు. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భమా అని ప్రశ్నించారు. వారణాసిలో కూడా దాడులు జరిగాయని.. అక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్‌ ‌చేయించిందా అని ఎద్దేవా చేశారు. అగ్నిపథ్‌ ‌పథకం వల్ల సైన్యంలో చేరిన యువకులకు 4 సంవత్సరాల తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా బయటకు పంపించే పథకం అన్నారు. ఇప్పటికే దేహదారుడ్య పరీక్షలు పూర్తి చేసుకొని..పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న యువకులపై మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన చర్యలే సికింద్రాబాద్‌లో జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ‌హింసకు వ్యతిరేకం అన్నారు. పోలీస్‌ ‌కాల్పుల్లో వరంగల్‌కు చెందిన యువకుడు చనిపోయాడని.. ప్రభుత్వ విధానాల వల్ల వేలాది మంది యువకులు నిరసన తెలిపారన్నారు. ముందుగా లాఠీచార్జి చేయడం వల్ల అక్కడ హింస జరిగిందని.. సంయమనం కోల్పోయి రైల్వే ఫోర్స్ ‌కాల్పులు జరిపిందని చెప్పారు. యువకుడు మరణించడంతో పాటు ఐదు గురికి గాయాలయ్యాయని తెలిపారు. కోటి రూపాయలు ఇచ్చి పరమర్శించాల్సిన కిషన్‌ ‌రెడ్డి, అమిత్‌ ‌షా దగ్గరికి వెళ్లరని చెప్పారు. ట్విట్టర్‌ ‌పిట్ట ట్విట్టర్‌లో ఏదో వాగితే దానికి మాట్లాడుతుండని..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదు..ఇద్దరు దోషులే అన్నారు. పార్లమెంట్‌ ‌వేదికగా ఎందుకు నిలదీయలేదన్న రేవంత్‌ ‌రెడ్డి.. తక్షణమే అగ్నిపథ్‌ ‌విధానం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రధాని పార్లమెంట్‌ ‌నియోజకవర్గం వారణాసిలోనూ బస్సుల అద్దాలు పగిలయి, రైళ్లు తగులబెట్టారని.. వేలాదిమంది యువకులు నిరసనలో పాల్గొన్నారని చెప్పారు. బాధ్యత కలిగిన కిషన్‌ ‌రెడ్డి ఎం మట్లాడుతున్నారన్న రేవంత్‌ ‌రెడ్డి.. వాళ్ళ అధ్యక్షుడి నాలెడ్జ్ అం‌తే అన్నారు. కాంగ్రెసు పిలుపునిస్తే టీఆరెస్‌,ఎంఐఎం ‌దాడి చేశారా..? ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భమా..అని రేవంత్‌ ‌ప్రశ్నించారు

రాకేశ్‌ ‌శవయాత్రలో పాల్గొనకూడదా.. అడ్డోకోవడంలో అర్థం ఉందా అని రేవంత్‌ ‌ప్రశ్న

పరామర్శలకు కూడా అధికారపార్టీ పర్మిసన్లు తీసుకోవాలా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. వరంగల్‌లో రాకేశ్‌ ‌కటుంబాన్ని పరమార్శించేందుకు తాను వెళితే వీరికి వొచ్చిన నష్టమేందని అన్నారు. రాకేష్‌ను చంపింది టీఆర్‌ఎస్‌..‌చంపించింది బీజేపీ అని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. రాకేష్‌ అం‌తిమ యాత్రలో పాల్గొనేందుకు వెళుతున్న రేవంత్‌ను ఘట్‌కేసర్‌ ‌వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ.. రాకేష్‌ ‌కుటుంబాన్ని పరామర్శిస్తే, రాకేష్‌ ‌భౌతిక కాయానికి నివాళులు అరిస్తే.. వరంగల్‌ ‌వెళ్తే పోలీసులకు వొచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ‘టీఆర్‌ఎస్‌ ‌మంత్రులు రాకేష్‌ ‌శవయాత్ర చేయొచ్చు..అలాగే గులాబీ జెండాలు కట్టుకొని యాత్రలో పాల్గొనవచ్చు. మేము వెళ్ళడానికి కూడా ఇన్ని అడ్డంకులా? చావులను కూడా టీఆర్‌ఎస్‌ ‌రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు. త్వరలో సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లేరేషన్‌ ‌ప్రకటిస్తాం. ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి. ఇది నా పార్లమెంట్‌ ‌నియోజకవర్గం. అక్కడ కుటుంబాన్ని పరామర్శించాలని వెళ్తున్నది.. రాజకీయాల కోసం కాదు..ఎందుకు అరెస్ట్ ‌చేస్తున్నారో చెప్పండి’ అంటూ పోలీసులను ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *