మద్ధతు ప్రకటించి స్వాగతించిన సిఎం పట్నాయక్
భువనేశ్వర్, జూలై 8 : రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల అధినేతలతో ఎన్డీఏ అభ్యర్థి ముర్ము సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవరాం సొంత రాష్ట్రం ఒడిశాకు వచ్చిన ఆమె.. నవీన్ పట్నానాయక్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేడీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ద్రౌపది ముర్మును నవీన్ పట్నానాయక్ సత్కరించారు. ఇప్పటికే ముర్ముకు మద్దతు ప్రకటించిన బీజేడీ, మిగతా సభ్యుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒడిశా అసెంబ్లీలో ప్రస్తుతం బీజేడీకి 112 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి 22 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఒకరు స్వతంత్రులు కాగా.. మరొకరు వాపక్షాలకు చెందిన వ్యక్తి ఉన్నారు. తర్వాత బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన ముర్ము.. అక్కడ నుంచి యూపీకి బయల్దేరారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఆమె ఘన స్వాగతం పలికారు. అనంతరం సన్మానించారు. ద్రౌపది ముర్ము.. ఒడిశాకు చెందిన వారే కావడం వల్ల.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు మద్దతు తెలపనున్నట్లు ఇప్పటికే సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.


