సామాజిక శాస్త్రవేత్త
శ్రామికోద్యమ నిర్మాత
సామ్యవాద సిద్ధాంతకర్త
డెమొక్రటిక్ విప్లవకారుడు
కమ్యూనిస్టు పితామహుడు
అతడే..కారల్ హేన్రి మార్కస్
ప్రపంచ భవిష్యత్ రూపును
సూత్రీకరించిన దార్శనికుడు
శాస్త్ర జ్ఞానం..చారిత్రక కోణం
సామాజిక న్యాయ సూత్రాలు
ఏకం చేసిన మేధో సంపన్నుడు
ఏ దేశ పౌరసత్వం లేకున్నా
తాను ప్రపంచ పౌరుడినని
ప్రకటించిన విశ్వమానవుడు
పోరాడితే పోయేదేమి లేదు
బానిస సంకెళ్లు తప్పా! అని
నినదించిన పరాక్రమధీరుడు
పెట్టుబడిదారీ వ్యవస్థపై
కలాన్ని ఎక్కుపెట్గినవాడు
చరిత్ర ఎరుపెక్కించినవాడు
శ్రామిక జన చైతన్యం కోసం
మానవాళి సమానత్వం కోసం
నినతం శ్రమించిన కార్యదక్షుడు
కటిక దారిద్య్రం వెంటాడినా
వెరవని విలువల సంపన్నుడు
నిష్క్రమించి తన మార్క్సిజంతో
ప్రపంచాన్ని ప్రభావితం చేసేవాడు
ప్రపంచ ఎర్ర పతాక
బావితరాల కరదీపిక
మార్కస్ మహానీయకు
శ్రామిక జన సలాములు
కార్మిక వర్గ నీరాజనాలు
(మే 5న కార్ల్ మార్కస్ జయంతి సందర్బంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493