సమస్యల పరిశీలనకు వెళ్తుంటే…కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం అక్రమం

  • పోలీసుల తీరుపై మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి
  • రోడ్డుపైనే వానలో బైఠాయించి నిరసన
  • ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌ ‌కూడా అరెస్ట్
  • ‌డబుల్‌ ఇళ్లపై బిజెపి పోరుబాట
  • బాట సింగారం వెళ్లకుండా పోలీసుల బ్రేక్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : బాట సింగారంలో డబుల్‌ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు బయలు దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ ‌చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురువారం ఉదయం దిల్లీ నుంచి హైదరాబాద్‌ ‌వొచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావుతో కలిసి బాట సింగారంకు బయలుదేరారు. బాట సింగారంలో డబుల్‌ ‌బెడ్రూం ఇళ్ళను పరిశీలించేందుకు కేంద్రమంత్రి అక్కడకు పయనమయ్యారు. అయితే కేంద్ర మంత్రి అయిన కిషన్‌రెడ్డిని అడ్డుకుంటారా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఎయిర్‌పోర్టు పరిధి దాటగానే వాహనాలను అడ్డుపెట్టి మరీ కేంద్రమంత్రి కాన్వాయ్‌ను పోలీసులు ఆపేశారు. దీంతో పోలీసులతో కిషన్‌ ‌రెడ్డి, రఘునందనరావు వాగ్వివాదానికి దిగారు. అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి..కేంద్రమంత్రిని అడ్డుకున్నామని పోలీసులు చెప్పారు. దీంతో వారు వర్షంలోనే తడుస్తూ నిరసనలకు దిగారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు, నాయకులు భగ్గుమన్నారు. చివరకు బలవంతంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ ‌చేసి అక్కడి నుంచి తరలించారు.

ఈ ఘటనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా.. బీజేపీ చలో బాటసింగరాం పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ నేతలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఈటల సహా.. బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. అనుమతి లేనందున బీజేపీ నేతలెవరూ బాటసింగారం రావొద్దని పోలీసులు చెప్పారు. కిషన్‌ ‌రెడ్డి తీసుకెళ్లేందుకు డీసీపీ స్థాయి అధికారి ముందుకొచ్చారు. డ్రైవర్‌ను దింపేసి మరీ..కిషన్‌ ‌రెడ్డి వాహనాన్ని డీసీపీ స్థాయి అధికారి నడుకుంటూ వెళ్లారు. అయితే బీజేపీ చీఫ్‌ను ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాన్ని పోలీసులు చెప్పేందుకు నిరాకరించారు. మరోవైపు కిషన్‌రెడ్డి అరెస్ట్ ‌విషయం తెలిసిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో శంషాబాద్‌ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుకు చేరుకున్నారు. అరెస్ట్ ‌సమయంలో కిషన్‌రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ…75 ఏళ్ల భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర కేబినెట్‌ ‌మంత్రిని ప్రజాసమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.

దీనిపై పార్లమెంటు స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకన్నా తాను ఎక్కువ బాధ్యతగా ఉంటానన్నారు. కేసీఆర్‌ ‌తొత్తుల్లాగా కాకుండా ప్రజాసేవకుల్లో పోలీసులు వ్యవహరించాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి కాన్వాయ్‌కు డీసీఎంను అడ్డంపెట్టి ఆపేంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో దౌర్జన్య పాలన నడుస్తుందని విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా పోలీసులు ఇంత దౌర్జన్యంగా వ్యవహరించడం లేదన్నారు. బాటసింగారం వెళ్లేందుకు అడ్డుకోవద్దని పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు. కేంద్రమంత్రిని అడ్డుకునే వి•రు సామాన్యులతో ఎలా వ్యవహరిస్తారో అర్థమవుతుందంటూ కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులు తీరుకు నిరసనగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ధర్నాకు దిగారు. జోరు వానలోనే రోడ్డుపై కిషన్‌ ‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావు బైఠాయించారు. కిషన్‌ ‌రెడ్డి, రఘునందన్‌రావు మినహా మిగిలిన వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. బాటసింగారం తీసుకెళ్లాలని పోలీసులను బీజేపీ నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులపై కిషన్‌ ‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి కాన్వాయ్‌నే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. తానేవి• టెర్రరిస్టును కాదని అన్నారు. నిరసన తెలిపే హక్కు తనకు ఉందని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. నాటకీయ పరిణామాలతో చివరకు కిషన్‌ ‌రెడ్డిని ఒప్పించి ధర్నా చేస్తున్న ప్రదేశం నుంచి తీసుకెళ్లారు. బలవంతంగా తీసుకెళ్లి ఆయన కాన్వాయ్‌లోని వాహనంలోనే కూర్చోబెట్టారు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు వి•దుగా ఆయన్ని తరలించారు. కేంద్రమంత్రి పట్ల తెలంగాణ పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు మండిపడ్డారు. కచ్చితంగా ప్రభుత్వం తీరుపై, పోలీసుల ప్రవర్తనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓ వైపు పార్లమెంట్‌ ‌నడుస్తుండగానే కేంద్రమంత్రిపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో మోసం చేస్తుంటే ప్రతిపక్షంగా బీజేపీ అడగతం తప్పా అని నేతలు ప్రశ్నిచారు. పరిశీలనకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.

ఉదయం ఐదు గంటల నుంచే పోలీసులు తమ వాహనాలను తీసుకొచ్చి ఇళ్ల చుట్టూ మోహరించారని డీకే అరుణ ఆరోపించారు. బాట సింగారం వద్ద డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ళను పరిశీలించాలని బీజేపీ నిర్ణయిస్తే జంటనగరాల్లో ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్ట్ ‌చేయడం దుర్మార్గమైన చర్య అని ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రతీసారి అధికార పార్టీకి ఇది అలవాటుగా మారిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉందని… ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. కేసీఆర్‌ ‌నిరంకుశంగా వ్యవహరి స్తున్నారని మండిపడ్డారు. తమను నిర్బంధించినంత మాత్రాన పోరాటం ఆగదని… కేసీఆర్‌ ‌తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని…అరెస్టులు కొత్త కాదని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *