విద్యుత్‌ ‌పథకం అమలులో అర్హులకు అన్యాయం

‌రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ తో పొత్తు ఉంటుందని ఈ మేరకు మంగళవారం నాడు  తనతో కలిసి  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌చేసిన చర్చలను, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్‌ ‌సమావేశంలో వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వంటి అణగారిన వర్గాల అభ్యున్నతికోసమే నాటి ఉద్యమక్‌ ‌కాలం నుంచి ప్రగతి కాలం వరకు పనిచేస్తున్న బిఆర్‌ఎస్‌ ‌పార్టీ%••% అదే సైద్ధాంతికతో భావ సారూప్యతతో పనిచేస్తున్న  బీఎస్పీ తో పొత్తును ప్రజలు హర్షిస్తారని కేసీఆర్‌ ‌తెలిపారు. ఇప్పటికే సానుకూల స్పందన వస్తున్నదన్నారు.

‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో మనం మన శక్తులను కూడదీసుకోవాలి. కలిసి వచ్చే భావసారూప్య శక్తులను కలుపుకొని పోవాలి. ఆ దిశగా మనం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర  వ్యాప్తంగా ప్రజా ప్రయోజనాలను కాపాడే దీర్ఘ కాలిక లక్ష్యం తో కూడుకుని వున్నది’’ అని కేసీఆర్‌ అన్నారు.vలౌకిక వాద తాత్వికత తో బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన కృషి ఆ దిశగా పదేండ్ల పాటు అనుసరించిన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ నేపధ్యంలో దళిత బహుజన శక్తులతో కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు  మరింత చేరువవుతామన్నారు. రాబోయే కాలం లో బిఆర్‌ఎస్‌ ‌బీఎస్పీ లు కలిసకట్టుగా పనిచేసి ప్రజా అభీష్టాలను సంపూర్ణంగా నెరవేరుస్తామని కేసీఆర్‌ అన్నారు.ఈ దిశగా మరిన్ని చర్చలు జరిపి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుల విధి విధానాలను ఖరారు చేస్తామని అన్నారు. కాగా బీఎస్పీ తో పొత్తును సమావేశం హర్షద్వానాల నడుమ ముక్తకంఠం తో ఏకీభవించింది. తన ప్రయత్నానికి మద్దతు ప్రకటించిన పార్టీ నేతలకు అధినేత ధన్యవాదాలు తెలిపారు.

పాలమూరు పార్లమెంటు అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డి :
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్నగర్‌ ‌నియోజకవర్గ అభర్ధిగా ప్రస్తుత సిట్టింగ్‌ ఎం‌పీ మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డి ని అధినేత కేసీఆర్‌ ‌ప్రకటించారు. ఈ మేరకు సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలను అనుసరించి మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. కాగా .. ముఖ్యనేతలతో మరోసారి చర్చించి నాగర్‌ ‌కర్నూలు ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తామని కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు పలువురు ముఖ్య నేతలు సమావేశం లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *