లడ్డు దొంగలు…!

 

లడ్డు దొంగతనానికి యత్నించిన యువకులు అరెస్ట్

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర: గణేష్ లడ్డు దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వనస్థలిపురం ఇన్స్పెక్టర్ డి జలంధర్ రెడ్డి తెలిపారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మన్సూరాబాద్ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అర్ధరాత్రి రెండు గంటలకు సమయంలో నలుగురు వ్యక్తులు ఒక యాక్టివా వాహనంపై వచ్చు లడ్డు దొంగిలించడానికి ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడ కాపలాగా ఉన్న వ్యక్తి (చందు) మెలకువగా ఉండి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యారు. అ ఇద్దరు వ్యక్తులను సప్తగిరి కాలనీలో పోలీసు వారు అరెస్టు చేశారు. గొడ్డేటి అజయ్(19) తండ్రి యాదగిరి,బొడ్డుపల్లి మహేష్(19) తండ్రి శ్రీను ఇద్దరు వ్యక్తులు బాలుర ను అరెస్ట్ చేశారు. రాత్రి సమయంలో కచ్చితంగా ఇద్దరు వ్యక్తులు మండపంలో కాపలాగా ఉండాలని ఎస్ ఐ సూచిం చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహృదయ వాతావరణం లో గణేష్ పండగ జరుపుకోవాలని వనస్థలిపురం ఇన్స్పెక్టర్ డి జలంధర్ రెడ్డి సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *