వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: శాసనసభ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 30న నిర్వహించిన పోలింగ్ సంబంధించి రేపు ఆదివారం కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రేపు ఆదివారం వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ పరిగిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి టేబుల్స్ వారిగా కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
రేపు పరిగి లో శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు సిద్ధం




