యమున హైవేపై ఘోర ప్రమాదం

డివైడర్‌ను ఢీకొన్న బోల్తాపడ్డ బస్సు – చిన్నారి సహా ముగ్గురు మృతి
లక్నో,ఫిబ్రవరి27 :ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌లోని మధుర – యమున ఎక్స్ ‌ప్రెస్‌ ‌హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బిహార్‌ ‌వెళ్తున్న డబుల్‌ ‌డెక్కర్‌ ‌బస్సు డివైడర్‌ ‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా,12మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన రాత్రి 11.30 గంటలకు జరగగా..  అర్థరాత్రి వరకు అక్కడ ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *