Take a fresh look at your lifestyle.

కోల్‌కతాలో విమానానికి తప్పిన ముప్పు

టేకాఫ్‌ ‌సమయంలో విరిగిన ఇంజిన్‌ ‌బ్లేడ్లు
కోల్‌కతా,ఫిబ్రవరి27 : విమానం టేకాఫ్‌ ‌సమయంలో ఇంజిన్‌ ‌బ్లేడ్లు విరిగాయి. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ‌చేశారు. పశ్చిమబెంగాల్‌ ‌రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధ రాత్రి తర్వాత 1.09 గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 ‌విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ ‌నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌ అయిన సమయంలో ఆ విమానం ఎడమ ఇంజిన్‌లోని బ్లేడ్లు విరిగాయి. పైలట్లు వెంటనే దీనిని గ్రహించారు. ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. 1.27 గంటలకు తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ఎమ్జన్సీ ల్యాండింగ్‌ ‌చేశారు. బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన178 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు. కాగా, ఈ సంఘటన నేపథ్యంలో మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు స్పైస్‌జెట్‌ ‌తెలిపింది.

దీంతో బ్యాంకాక్‌ ‌వెళ్లేందుకు సోమవారం ఉదయం 7 గంటలకు ఆ విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ ‌నుంచి టేకాఫ్‌ అయినట్లు చెప్పింది. అయితే తెల్లవారుజామున 2 గంటల వరకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఎమ్జ్గ•న్సీ పరిస్థితి కొనసాగినట్లు స్పైస్‌జెట్‌ ‌వెల్లడించింది. ఇంజిన్‌ ‌బ్లేడ్లు విరిగిన విమానాన్ని బే నుంచి వాహనంతో లాక్కెళ్లినట్లు వివరించింది. టేకాఫ్‌ ‌సమయంలో విమానం ఇంజిన్‌ ‌బ్లేడ్లు విరిగినట్లు దర్యాప్తులో గ్రహించామని పేర్కొంది. ఈ విషయాన్ని డీజీసీఏకు నివేదించినట్లు వెల్లడించింది.

Leave a Reply