మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలి

సీఎం కేసీఆర్ ని కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: సోమవారం సాయంత్రం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి జనగామ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  కోరారు. దీనికి సీఎం  సానుకూలంగా స్పందించారు. అదే విధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయని , వాటి మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలని కోరడంతో పాటు జనగామ జిల్లా కేంద్రానికి, చేర్యాల మునిసిపాలిటీకి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *